ఈ నెల 31న రాన్నున్న సాయిధరమ్‌ కొత్త సినిమా టీజర్

- July 29, 2017 , by Maagulf
ఈ నెల 31న రాన్నున్న సాయిధరమ్‌ కొత్త సినిమా టీజర్

సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘జవాన్‌’. ‘ఇంటికొక్కడు’ అనేది ఉప శీర్షిక. బి.వి.ఎస్‌. రవి దర్శకుడు. మెహరీన్‌ కథానాయిక. ఈ చిత్రం టీజర్‌ను జులై 31న విడుదల చేస్తున్నట్లు సాయిధరమ్‌ ప్రకటించారు. ఈ సందర్భంగా ట్విటర్‌లో కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఆటలో ‘జై’ పావులా మారుతాడా లేక రాజు అవుతాడా? అని అన్నారు. జులై 31 సాయంత్రం 5 గంటల నుంచి ఆట ప్రారంభం కానున్నట్టు ట్వీట్‌ చేశారు.
అరుణాచల్‌ క్రియేషన్స్‌ పతాకంపై నిర్మిస్తున్న ‘జవాన్‌’ చిత్రాన్ని దిల్‌రాజు సమర్పిస్తున్నారు. థమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ప్రసన్న, సత్యం రాజేశ్‌, కోట శ్రీనివాసరావు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com