శ్వేతసౌధం సిబ్బంది చీఫ్‌గా జనరల్ జాన్ కెల్లీ
- July 30, 2017
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరో కీలక మార్పు చేశారు. ఇప్పటి వరకు అమెరికా అంతర్గత వ్యవహారాలను పర్యవేక్షించిన కార్యదర్శి జనరల్ జాన్ కెల్లీని శ్వేతసౌధం సిబ్బంది చీఫ్‌గా నియమించారు. ఈ విషయాన్ని ట్రంప్ స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 'ఈ విషయం చెప్పేందుకు నేను చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాను. ఇప్పుడే నేను జాన్ ఎఫ్.కెల్లీని వైట్‌హౌస్ స్టాఫ్ చీఫ్‌గా ప్రకటించాను. ఆయన గొప్ప అమెరికన్. గొప్ప నాయకుడు. అంతర్గత వ్యవహారాల కార్యదర్శిగా ఆయన బృహత్తర విధులు నిర్వర్తించారు. నా పరిపాలన వర్గంలో ఆయన నిజమైన స్టార్' అంటూ ట్రంప్ పేర్కొన్నారు. కెల్లీ రెయిన్స్ ప్రీబస్ స్థానంలో పనిచేయనున్నారు.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్‌సిఎం
- ఫ్రంట్‌లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







