గర్భం లో శిశువు ఎదుగుదల చూడటానికి కొత్త గా డిజిటల్ స్కానింగ్
- July 30, 2017
భారత సంతతికి చెందిన మాలా వస్త్ ధురి ఇటీవల చక్కని కవలలకు జన్మనిచ్చారు. ఇందులో వింతేమీ అనుకుంటున్నారా? ఇక్కడే ఉంది అసలు సంగతి! గర్భంలోని కవలలను ‘డిజిటల్ గ్రోత్ చార్ట్స్’ ఆధారంగా డాక్టర్లు నిరంతరం పర్యవేక్షిస్తూ రావడం, అలాంటి కవలలకు మాలా జన్మనివ్వడం ప్రపంచంలో ఇదే తొలిసారి. మాలా గర్భం ధరించినప్పటి నుంచి డాక్టర్లు ఆమెకు తరచూ స్కానింగ్‌లు చేయడం, వాటి ఆధారంగా డిజిటల్ చార్ట్స్ తయారు చేయడం చేశారు. చార్ట్స్ ద్వారా గర్భస్థ శిశువు అభివృద్ధిని ఎప్పటికప్పుడు కచ్చితంగా తెలుసుకోగలిగారు.
ప్రసవం సమయానికల్లా మాలాకు 10 వేల స్కానింగ్‌లు చేశారు. ఈ తరహా చార్ట్స్‌ను లండన్ సెయింట్ జార్జ్ హాస్పిటల్ వైద్యులు కనుగొన్నారు. కవల శిశువుల ఎదుగుదల తెలుసుకునేందుకు వీటిని డిజైన్ చేశారు. వీటి ద్వారా గర్భంలో కవలల అభివృద్ధిని ఎప్పటికప్పుడు కచ్చితంగా గుర్తించవచ్చని, తద్వారా వేలాది మంది పిల్లల ప్రాణాలను కాపాడవచ్చని ఈ ప్రాజెక్టులో పాలుపంచుకున్న డాక్టర్ ఆస్మా ఖలీల్ తెలిపారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







