గర్భం లో శిశువు ఎదుగుదల చూడటానికి కొత్త గా డిజిటల్ స్కానింగ్

- July 30, 2017 , by Maagulf
గర్భం లో శిశువు ఎదుగుదల చూడటానికి కొత్త గా డిజిటల్ స్కానింగ్

భారత సంతతికి చెందిన మాలా వస్త్‌ ధురి ఇటీవల చక్కని కవలలకు జన్మనిచ్చారు. ఇందులో వింతేమీ అనుకుంటున్నారా? ఇక్కడే ఉంది అసలు సంగతి! గర్భంలోని కవలలను ‘డిజిటల్‌ గ్రోత్‌ చార్ట్స్‌’ ఆధారంగా డాక్టర్లు నిరంతరం పర్యవేక్షిస్తూ రావడం, అలాంటి కవలలకు మాలా జన్మనివ్వడం ప్రపంచంలో ఇదే తొలిసారి. మాలా గర్భం ధరించినప్పటి నుంచి డాక్టర్లు ఆమెకు తరచూ స్కానింగ్‌లు చేయడం, వాటి ఆధారంగా డిజిటల్‌ చార్ట్స్‌ తయారు చేయడం చేశారు. చార్ట్స్‌ ద్వారా గర్భస్థ శిశువు అభివృద్ధిని ఎప్పటికప్పుడు కచ్చితంగా తెలుసుకోగలిగారు.
ప్రసవం సమయానికల్లా మాలాకు 10 వేల స్కానింగ్‌లు చేశారు. ఈ తరహా చార్ట్స్‌ను లండన్‌ సెయింట్‌ జార్జ్‌ హాస్పిటల్‌ వైద్యులు కనుగొన్నారు. కవల శిశువుల ఎదుగుదల తెలుసుకునేందుకు వీటిని డిజైన్‌ చేశారు. వీటి ద్వారా గర్భంలో కవలల అభివృద్ధిని ఎప్పటికప్పుడు కచ్చితంగా గుర్తించవచ్చని, తద్వారా వేలాది మంది పిల్లల ప్రాణాలను కాపాడవచ్చని ఈ ప్రాజెక్టులో పాలుపంచుకున్న డాక్టర్‌ ఆస్మా ఖలీల్‌ తెలిపారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com