మంచు విష్ణు ప్రమాదంపై స్పందించిన కుటుంబీకులు
- July 30, 2017
మలేషియాలో ‘ఆచారి అమెరికా యాత్ర’ షూటింగ్ జరుగుతుండగా హీరో మంచు విష్ణు గాయపడిన సంగతి తెలిసిందే. బైక్‌పై నుంచి కింద పడటంతో ఆయనకు గాయాలయ్యాయి. ప్రస్తుతం విష్ణు అక్కడి స్థానిక ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో విష్ణు తండ్రి మోహన్‌బాబు, సోదరుడు మంచు మనోజ్, సోదరి మంచు లక్ష్మి, దర్శకుడు బీవీఎస్ రవి ట్వీట్లు చేశారు. ‘దేవుడి దయతో నా కుమారుడు సురక్షితంగా ఉన్నాడు’ అని మోహన్‌బాబు ట్వీట్ చేశారు.
* మంచు మనోజ్: ‘మీ అందరి ఆశీస్సుల వల్ల అన్నయ్య సురక్షితంగా ఉన్నారు. ఆయన స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు’.
* మంచు లక్ష్మి: ‘మీ అందరి ప్రేమ, ఆశీస్సులతో విష్ణు చాలా పెద్ద ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో తప్పించుకున్నారు. మీ అందరి పరామర్శకు నాన్న ధన్యవాదాలు చెప్పారు’.
* బీవీఎస్ రవి: ‘ఇప్పుడే విష్ణు ప్రమాదం గురించి ఆయన భార్య వెరోనికాకు ఫొన్ చేసి మాట్లాడాను. ధన్యవాదాలు దేవుడా! ఆయన సురక్షితంగా ఉన్నారు, కానీ గాయపడ్డారు. బైక్‌పైన విష్ణుతోపాటు ప్రగ్యా జైశ్వాల్ కూడా ఉన్నారు. ఆమె సేఫ్ అయ్యారు’
తాజా వార్తలు
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!







