అధ్యక్షుడు నికోలస్‌ వ్యతిరేకంగా వెనిజులాలో తీవ్ర ఆందోళనలు

- July 31, 2017 , by Maagulf
అధ్యక్షుడు నికోలస్‌ వ్యతిరేకంగా వెనిజులాలో తీవ్ర ఆందోళనలు

ఎన్నికల వేళ అధ్యక్షుడు నికోలస్‌ మదురోకి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ప్రతిపక్షాల నియంత్రణలో ఉన్న కాంగ్రెస్‌ను రద్దు చేసేందుకు రాజ్యాంగ సవరణకు పూనుకున్న మదురో .. దేశీయంగా, అంతర్జాతీయంగానూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ తాజాగా పార్లమెంటు ఎన్నికలకు వెళ్లారు. ఈ ఎన్నికలకు వ్యతిరేకంగా విపక్షాలు చేపట్టిన ఆందోళనల్లో ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఓ అభ్యర్థి, ప్రతిపక్షానికి చెందిన యువజన నాయకుడు సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆందోళనకారుల్ని చెదరగొట్టేందుకు బలగాలు కారకాసులో కాల్పులు జరిపాయి. ఫలితంగా స్థానికులు భయాందోళనకు గురయ్యారు. శనివారం జరిగిన నిరసనల్లో మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోగా.. అధ్యక్షుడికి వ్యతిరేకంగా నాలుగు నెలల నుంచి జరుగుతున్న ఆందోళనల్లో దాదాపు 110 మంది మృతి చెందారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com