నేడు పాకిస్థాన్ ఆపద్ధర్మ ప్రధాని ఎన్నిక
- July 31, 2017
పాకిస్థాన్ ఆపద్ధర్మ ప్రధాని పదవి కోసం ఆరుగురు పోటీ పడుతున్నారు. మంగళవారం జరగనున్న ఎన్నికల్లో పాకిస్థాన్ ముస్లిం లీగ్(నవాజ్) తరఫున షహీద్ ఖాకన్ అబ్బాసీ నామపత్రం సమర్పించారు. ఉమ్మడి అభ్యర్థిని నిలపడంపై ప్రతిపక్షాల్లో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో అయిదుగురు నామపత్రాలు దాఖలు చేశారు. దిగువసభ నేషనల్ అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 342 కాగా, విజయం సాధించడానికి 172 ఓట్లు రావాల్సి ఉంది. నవాజ్ పార్టీ, మిత్ర పక్షాలకు 209 సీట్లు ఉండడంతో అబ్బాసీ విజయం ఖాయంగా కనిపిస్తోంది.
పాక్ ఆపద్ధర్మ ప్రధాని అభ్యర్థి పైనా అవినీతి కేసు: పాకిస్థాన్ ఆపద్ధర్మ ప్రధాని అభ్యర్థి షహీద్ ఖాకన్ అబ్బాసీ కూడా అవినీతి ఆరోపణలపై విచారణ ఎదుర్కొంటున్నారు. రూ.22 వేల కోట్ల విలువైన ద్రవీకృత సహజవాయువు (ఎల్ఎన్జీ) కాంట్రాక్టు మంజూరులో అవినీతికి పాల్పడినట్టు వచ్చిన ఆరోపణలపై 2015లో జాతీయ జవాబుదారీ సంస్థ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోందని డాన్ న్యూస్ పత్రిక వెల్లడించింది. మరోవైపు విదేశీ విరాళాల కేసులో ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు, ప్రతిపక్ష నేత ఇమ్రాన్ ఖాన్ సుప్రీంకోర్టుకు తప్పుడు పత్రాలు సమర్పించారని నవాజ్ షరీఫ్ పార్టీ ఆరోపించింది.
తాజా వార్తలు
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!







