అక్టోబర్‌లో భూమికి చేరువగా గ్రహశకలం
- July 31, 2017
ఈ ఏడాది అక్టోబర్‌లో ఓ గ్రహశకలం భూమికి అతిదగ్గరగా రాబోతోంది. ఇది భూమిని ఢీకొట్టే ప్రమాదం లేనప్పటికీ అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఈ సంఘటనను ఒక అవకాశంగా మలుచుకుంటోంది. భూమివైపు దూసుకొచ్చే గ్రహశకలాలను పసిగట్టేందుకు అభివృద్ధి చేసిన టెక్నాలజీని పరీక్షించేందుకు సిద్ధమవుతోంది. విశ్వం నుంచి నిత్యం అనేకానేక గ్రహశకలాలు దూసుకొస్తూంటాయని.. కొన్ని భూమికి దగ్గరగా వెళతాయని మనందరికీ తెలుసు.
వీటిని గమనించేందుకు నాసా ఆధ్వర్యంలోని ప్లానెటరీ డిఫెన్స్ కో ఆర్డినేషన్ ఆఫీస్ పనిచేస్తోంది. తాజాగా 2012 టీసీ4 అని పేరు పెట్టిన ఓ గ్రహశకలం భూమికి కేవలం 6,800 కిలోమీటర్ల దూరం నుంచి దూసుకెళ్లనుంది. ఈ గ్రహశకలాన్ని తాము 2012లోనే గుర్తించామని అయితే అప్పట్లో ఇది వారం రోజుల పాటే పరిశీలనలకు అందుబాటులో ఉందని అరిజోనా యూనివర్సిటీ శాస్త్రవేత్త విష్ణురెడ్డి తెలిపారు. ఇప్పుడు దీన్ని మరింత క్షుణ్నంగా అధ్యయనం చేసేందుకు వీలు కలుగుతుందని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!







