హైదరాబాద్‌లో టీ20.. వైజాగ్‌లో వన్డే వేదికలు ఖరారు చేసిన బీసీసీఐ
- August 01, 2017
వేదికలు ఖరారు చేసిన బీసీసీఐ
స్వ దేశీ సీజన్‌లో టీమ్‌ఇండియా మ్యాచ్‌ల వేదికలను బీసీసీఐ ఖరారు చేసింది. సెప్టెంబరు నుంచి డిసెంబరు ఆఖరి వరకు స్వదేశంలో భారత జట్టు 23 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడనుంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో వన్డే, టీ20 సిరీస్‌లను ఆడనున్న భారత జట్టు శ్రీలంకతో మూడేసి టెస్టులు, వన్డేలు, టీ20 సిరీస్‌ను ఆడనుంది. మంగళవారం బీసీసీఐ పర్యటనల ప్రణాళిక కమిటీ ఈ మ్యాచ్‌ల వేదికలను ప్రకటించింది. ఆస్ట్రేలియాతో టీ20కి హైదరాబాద్, శ్రీలంకతో వన్డేకు వైజాగ్ ఆతిథ్యమివ్వనున్నాయి. ఐతే మ్యాచ్‌ల తేదీలను ఇంకా ఖరారు చేయలేదు. శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు కోల్‌కతా, దిల్లీ, నాగ్‌పూర్ ఆతిథ్యం ఇవ్వనున్నాయి.
సిరీస్‌లు, వేదికల వివరాలు:
ఆస్ట్రేలియా సిరీస్: వన్డేలు (5): చెన్నై, బెంగళూరు, నాగ్‌పూర్, ఇండోర్, కోల్‌కతా టీ20లు (3): హైదరాబాద్, రాంచి, గువహాటి,
న్యూజిలాండ్ సిరీస్: వన్డేలు (3): పుణె, ముంబయి, కాన్‌పూర్ టీ20లు (3): దిల్లీ, కటక్, రాజ్‌కోట్,
శ్రీలంక సిరీస్: టెస్టులు (3): కోల్‌కతా, నాగ్‌పూర్, దిల్లీ వన్డేలు (3): ధర్మశాల, మొహాలి, వైజాగ్ టీ20లు (3): కోచి/తిరువనంతపురం, ఇండోర్, ముంబయి.
తాజా వార్తలు
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్‌బైజాన్‌లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!









