మురసోలి స్వర్ణోత్సవ వేడుకల్లో సినీ హీరోలు రజనీ, కమల్
- August 01, 2017
మురసోలి దిన పత్రిక స్వర్ణోత్సవ వేడుకల్లో నటుడు కమలహాసన్, రజనీకాంత్ పాల్గొననున్నారు.1942లో డీఎంకే నేత కరుణాధి చేతుల మీదగా ప్రారంభించిన వారపత్రిక మురసోలి ఆ తరువాత దిన పత్రికగా మార్చబడి నేటికీ కొనసాగుతోంది.ఈ పత్రిక ప్రారంభమై 75 వసంతాలు పూర్తికావటంతో స్వర్ణోత్సవ వేడకును ఈ నెల 10వ తేదీన చెన్నైలోని కళైవాణర్ ఆవరణలో ఘనంగా నిర్వహించనున్నారు.ఈ కార్యక్రమంలో నటుడు కమలహసన్, రజనీకాంత్ పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొననున్నారు. అయితే ఆహ్వాన పత్రికలో ప్రసంగించేవారి పేరుల్లో కమలహాసన్ పేరు మాత్రమే పేర్కొన్నారు.దీంతో రజనీకాంత్ పాల్గొనరనే ప్రచారం జరుగుతుండగా డీఎంకే నిర్వాహకులొకరు రజనీకాంత్ తప్పకుండా ఈ వేడుకలో పాల్గొంటారని, అయితే ఆయన మాట్లాడడానికి సుముఖత వ్యక్తం చేయకపోవడంతో ఆహ్వాన పత్రికలో ఆయన పేరు వేయలేదని వివరించారు.
ప్రధాని శుభాకాంక్షలు
మురసోలి పత్రిక స్వర్ణోత్సవాన్ని పురస్కరించుకుని 512 పేజీలతో కూడిన పత్రికను ప్రచరించారు.అందులో 13 మంది ప్రముఖ జాతీయ నాయకులు తమ అభిప్రాయాలతో కూడిన శుభాకాంక్షలను పేర్కొన్నారు. ప్రధాని నరేంద్రమోదితో పాటు, సోనియాగాంధీ, రాహుల్గాంధీ, కమ్యూనిస్ట్ పార్టీ నేతలు సీతారాం ఏచూరి, సుధాకరరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







