హీరో బాలకృష్ణ 'జయసింహ' షూటింగ్ షురూ
- August 03, 2017
తెలుగు ఇండస్ట్రీలో వరుస సినిమాలతో మంచి ఊపుమీదున్ననందమూరి నటసింహ బాలకృష్ణతో కోలీవుడ్ సీనియర్ డైరెక్టర్ కె.ఎస్.రవికుమార్ రూపొందించబోతోన్న సినిమా 'జయసింహ' షూటింగ్ రామోజీ ఫిల్మ్‌సిటీలో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి డైరెక్టర్ బోయపాటి శ్రీను క్లాప్ కొట్టగా, కెఎస్ రవి కుమార్ దర్శకత్వం వహించారు.ఆర్.ఎఫ్.సి.లో ఇప్పటికే ఈ చిత్రంకోసం ప్రత్యేకంగా ఓ సెట్‌ను నిర్మించారు.
ఆ సెట్‌లో 30 రోజుల పాటు బాలయ్య 102వ సినిమా లాంగ్ షెడ్యూల్ జరుపుకోబోతోంది. పైసావసూల్ రిలీజ్ కాకముందే తన నెక్ట్స్ సినిమాను మొదలు పెట్టాడు. తమిళ దర్శకుడు కెయస్ రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ 102 వ సినిమా నటించడం నందమూరి అభిమానులకు పండగే అని చెప్పాలి. ఇక హీరోయిన్ విషయానికి వస్తే.. గతంలో బాలకృష్ణ సరసన నయనతార చేసిన 'సింహా' .. 'శ్రీరామ రాజ్యం' సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి.
అందువలన ఈ కాంబినేషన్ కి ఎంతో క్రేజ్ వుంది. ఈ కారణంగానే నయనతారను తీసుకోవాలనే ఉద్దేశంతో తిసుకున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం బాలకృష్ణ తన 101వ సినిమా షూటింగుతో బిజీగా వున్నారు. 'పైసా వసూల్' పేరుతో .. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
'జయసింహ' చిత్రంలో బాలకృష్ణ సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా.. సీనియర్ నటులు మురళీమోహన్, బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్ లు నటిస్తున్నారు. సికే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై పి కళ్యాణ్ నిర్మిస్తుంగా చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నారు.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్‌సిఎం
- ఫ్రంట్‌లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







