లాస్ వేగాస్‌లోని హైపర్‌లూప్ వన్ ప్రయోగంలో మరో మైలురాయి
- August 03, 2017
ప్రపంచం మొత్తాన్ని ఆకర్షిస్తున్న అధునాతన రవాణా వ్యవస్థ హైపర్‌లూప్.. కీలక మైలు రాయిని దాటింది. అత్యధిక వేగంతో ప్రయాణీకులను ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తీసుకెళ్లే ఈ హైపర్‌లూప్ స్పీడ్ టెస్ట్‌లో రికార్డ్ స్థాయి వేగాన్ని అందుకుంది. లాస్ వేగాస్‌లోని ఎడాది ప్రాంతంలో ఈ పరీక్ష నిర్వహించారు. గంటకు 310 కిలోమీటర్ల వేగంతో ఇది దూసుకెళ్లింది. ఈ ప్రయోగంలో మోటర్లు, నియంత్రణ వ్యవస్థ, వాక్యూమ్ సిస్టమ్, మాగ్నటిక్ లావిటేషన్ వ్యవస్థలను పరిశీలించారు. దీంతో.. హైపర్‌లూప్ అన్నది కేవలం ఊహాజనిత ప్రయోగం కాదని... నిజంగా పనిచేస్తుందని నిరూపించగలిగామని ప్రకటించింది దీన్ని అభివృద్ధి చేస్తున్న హైపర్‌లూప్ వన్. దీన్ని వేగాన్ని క్రమంగా గంటకు 12 వందల కిలోమీటర్ల వరకూ తీసుకెళ్లేవిధంగా ప్రయోగాలు సాగుతున్నాయి. అమరావతికీ ఈ సాంకేతిక విధానాన్ని తీసుకు రావడానికి హైపర్‌లూప్‌వన్ ప్రతినిధులు ఇప్పటికే సీఎం చంద్రబాబును కలిసి చర్చించారు. దీనిపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ ప్రయోగం పూర్తిస్థాయిలో విజయవంతమైతే.. అత్యంత వేగంగా భూమిపై ప్రయాణించే అవకాశం అందుబాటులోకి వస్తుంది.
తాజా వార్తలు
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!







