భారతదేశంతో సహా మరో నాలుగు దేశాలలో యూఏఈ మసీదుల నిర్మాణం

- August 04, 2017 , by Maagulf
భారతదేశంతో సహా మరో నాలుగు దేశాలలో యూఏఈ  మసీదుల నిర్మాణం

యూఏఈ నేషనల్ ఆర్కైవ్స్ ఐదు మసీదులు నిర్మించడానికి మరియు యూఏఈ  వెలుపల రెండు బావులను తవ్వించేందుకు సన్నాహాలు చేస్తుంది. అబూదాబి ఎమిరేట్స్ శాఖ రెడ్ క్రెసెంట్ సహకారంతో ఈ దాతృత్వ కార్యాక్రమంను ప్రారంభించింది. మౌరిటానియ, సోమాలియా, బుర్కినా ఫాసో, మాలి ,భారతదేశం లో నిర్మించబడుతున్న ఈ అయిదు మసీదులలో ఒక్కో దానిలో కనీసం  800 మంది వ్యక్తుల ఒక్కసారే నమాజు చేసుకొనే సౌకర్యంతో వీటిని నిర్మిస్తున్నారు. మసీదు భవనం ప్రాజెక్ట్ క్రింద " జాతీయ  ప్రాచీన బాండాగారా మసీదులుగా " గా పిలవబడనున్నాయి. అదేవిధంగా రెండు బావులను  భారతదేశం మరియు  మాలిలో నిర్మించబడతాయి. నేషనల్ ఆర్కైవ్స్ ఎమిరేట్స్ రెడ్ క్రెసెంట్ కు తమ సహకారంతో పాటు వారి ఉద్యోగులు ఉదారంగా అందచేయబడిన విరాళాలకు ధన్యవాదాలు తెలియజేసింది. మానవ ఔత్సాహిక మరియు స్వచ్ఛంద, సామాజిక బాధ్యతలో భాగమైన వారి దాతృత్వంతో ఇవ్వడంపై హర్షాతిరేకాలు వ్యక్తం చేసింది. నేషనల్ ఆర్కైవ్స్ ఈ రకమైన స్వచ్ఛంద మానవతావాద కార్యకలాపాలను కొనసాగించడంతో  యూఏఈ ఆదర్శ చిత్రంను సూచించే ఉత్తమ మార్గంగా పరిగణించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com