ఖతార్‌కి మద్దతుగా ఇండియన్ కమ్యూనిటీ ఈవెంట్
- August 05, 2017
ఇండియన్ కమ్యూనిటీ మెంబర్స్, ఖతార్ మరియు ఖతార్ నాయకత్వానికి తాము సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని దోహాలో నిర్వహించిన ఇండో ఖతార్ ఫ్యాషన్ షో ద్వారా తెలియజేశారు. 'ఖతార్ అవర్ సెకెండ్ హోమ్ - ఎ సెలబ్రేషన్ ఆఫ్ సాలిడరిటి' పేరుతో కతార్ నేషనల్ థియేటర్లో ఈ ఈవెంట్ జరిగింది. మినిస్టర్ ఆఫ్ కల్చర్ అండ్ స్పోర్ట్స్ సలాహ్ బిన్ ఘనిమ్ అల్ అలి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇండియా - ఖతార్ మధ్య మంచి సంబంధాలున్నాయనీ, ఇలాంటి కార్యక్రమాలతో ఆ సంంధాలు మరింత బలపడ్తాయనీ, అలాగే ఖతార్ అభివృద్ధిలో భారతదేశానికి చెందిన ప్రజల భాగస్వామ్యం ఎంతో విలైనదని ఈ సందర్భంగా అల్ అలి చెప్పారు. బ్రిడ్జ్ ఖతార్ అసోసియేషన్, ఖతార్ నేషనల్ థియేటర్ ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేశాయి. రెండున్నర గంటలపాటు జరిగిన ఈ ఈవెంట్లో 120 మందికి పైగా భారతీయ కళాకారులు ఇచ్చిన పలు సాంస్కృతిక ప్రదర్శనలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండ్ స్పోర్ట్స్ తరఫున పలువురు అధికారులు ఖతార్ నేషనల్ థియేటర్ ప్రముఖులు మరియు ఖతార్‌లోని ఇండియన్ ఆర్గనైజేషన్స్‌కి సంబంధించిన లీడర్స్ పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
తాజా వార్తలు
- యూఏఈలో భారతీయుల పాస్‌పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర
- బ్రిటన్ రాజకీయాల్లో కీలక పరిణామం: నూతన ప్రధానిగా ఆండీ బర్న్‌హామ్ బాధ్యతలు!
- సౌదీలో AI టూల్స్ కు నెటిజన్లు జై..CST సంచలన రిపోర్ట్..!!
- జోర్డాన్, ఖతార్ విదేశాంగ మంత్రులతో ఒమాన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- ఎలక్ట్రిక్ బస్సుల దిశగా బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్..!!
- షార్జాలో అద్దెల తగ్గింపు.. ఒక నెల ఉచిత అద్దె ఆఫర్లు..!!
- కువైట్ లో విమానాలు రద్దుపై ఎయిర్ వేస్ క్లారిటీ..!!
- ఖతార్‌లో డ్రోన్లపై కొత్త చట్టం.. ఉల్లంఘనలకు 7 ఏళ్ల జైలుశిక్ష..!!
- భారత్ పార్లమెంట్ హౌస్‌లో యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తూక్ అల్ మార్రీకి ఘన స్వాగతం
- నూతన ‘తల్లీ–బిడ్డ ఎక్స్‌ప్రెస్’ వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు







