సౌదీ మత పోలీసుని హత్య చేసింది అతని కుమారుడిగా నిర్ధారణ
- August 05, 2017
జెడ్డా : నిజం నిప్పు లాంటిది...నెమ్మదిగానైనా అది అసత్యాన్ని దహించక తప్పదు. అగ్ని ప్రమాదంలో మరణించాడని అందరు భావిస్తున్న ఓ సౌదీ మత పోలీసు మర్డర్ మిస్టరీ ఎట్టకేలకు వీడింది. 17 ఏళ్ల కుమారుడే తుపాకీతో పలుమార్లు తండ్రిని కాల్చి చంపినట్లు వైద్య పరీక్షలో తేలింది. వివేక ఉన్నత కమిటీ అధిపతిని మతపరమైన పోలీసు అని పిలుస్తారు.ఆల్ ఖ్అస్సిమ్ పోలీసు ప్రతినిధి మేజర్ బాదర్ ఆల్ సుహైబని మాట్లాడుతూ జూలై 23 వ తేదీన నిపుణుల కేంద్రం ఇంటిలో ఓ అగ్నిప్రమాదం జరిగినట్లు తెలిపారు. ఒక పోలీసుగస్తీ దళం అక్కడకు వెళ్లి ఆ మంటలను ఆర్పివేసింది. ఆ గృహ యజమాని మృతదేహాన్ని ఆసుపత్రికి తీసుకువెళ్లారు, అక్కడ వైద్యులు జరిపిన శవ పంచనామాలో ఆ మత పోలీస్ మరణానికి అసలు కారణం ఛాతీలో అనేక బుల్లెట్లు దూసుకుపోవడమేనని నిర్ధారించారు. సివిల్ డిఫెన్స్ పరిశోధనా విభాగం ఈ కేసుని భద్రతా అధికారులకు బదిలీ చేశారు. జాగ్రత్తగా విచారణ జరిపిన తర్వాత, హంతకుడు మృతుని సొంత కుమారుడేనని తేల్చారు..కాగా హంతకుడు కౌమారదశలో ఉన్న మత పోలీస్ కుమారుడిగా గుర్తించారు. అధికారులు ఆ ఆయుధాన్ని కనుగొని ఆ నిందితుడిని నిర్బంధించారు మరియు పబ్లిక్ ప్రాసిక్యూషన్ కార్యాలయంకు అప్పగించారు. అక్కడ అతను నేరాన్ని అంగీకరించాడని పోలీస్ ప్రతినిధి ఆల్ సుహైబని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









