దేశపు అత్యున్నత పదవిలో మన తెలుగోడు
- August 06, 2017
మరో తెలుగు బిడ్డకు దేశంలోనే అత్యున్నత పదవి వరించింది. బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. వెంకయ్యనాయుడుకు శుభాకాంక్షలు అందిస్తూ ఆయన సక్సెస్ లైఫ్‌పై స్పెషల్ స్టోరీ అందిస్తోంది ఇండియా హెరాల్డ్.
భారత రాజకీయాల్లో నిరంతరం వినిపించే అరుదైన పేరు వెంకయ్యనాయుడు. ఆయన ఎక్కడున్నా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారిపోతారు. అపారమైన విషయ పరిజ్ఞానంతో పాటు సమస్యల నుండి గట్టెక్కించడంలో ఆయనకు ఆయనే సాటి. నిరంతరం సానుకూల దృక్ఫథాన్ని అవలంభించే ఆయన ఏది మాట్లాడినా అది వార్తే అవుతుంది. అంతటి ప్రతిభాశాలి.
ఎందరు పాలకులు మారినా.. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా వెంకయ్యనాయుడు మాత్రం అలాగే ఉన్నారు. నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉంటూనే తనదైన శైలిని సొంతం చేసుకున్నారు. తనకంటూ ఓ ఇమేజ్‌తో పాటు మరో బ్రాండ్‌ను సృష్టించుకున్నారు. కమల వికాసంలో ఆయన విస్మరించలేని పాత్రను పోషించారు. రాజకీయంలో ఎలా నెట్టుకు రావాలో.. ఎక్కడ నెగ్గాలో.. ఎక్కడ తగ్గాలో తెలిసిన విజ్ఞుడు..అపర చాణుక్యుడు వెంకయ్య.
ఆర్ఎస్ఎస్ తో సహా బీజేపీలో వెంకయ్యనాయుడు అంటే అపారమైన గౌరవం ఉంది. వాజ్‌పేయి, అద్వానీ, మోడీ ఇలా అగ్రనేతలందరితో వెంకయ్యనాయుడుకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే కాకుండా అన్ని రాష్ట్రాల్లో పార్టీ ఇబ్బందుల్లో ఉన్న అన్ని సందర్భాల్లో వెంకయ్య ముందుండి సమస్యను పరిష్కరించే వారు. బీజేపీలో ట్రబుల్ షూటర్‌గా ఆయనకు మంచి పేరుంది.
రాజకీయ జీవితం ప్రారంభమైన నాటి నుంచి ఆయన బీజేపీతోనే ఉన్నారు. క్రియాశీల రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఆయన లోక్‌సభ ఎంపీగా పోటీ చేయలేదు. మోడీ వేవ్ లోనూ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు. దాదాపు నాలుగు దశాబ్దాల రాజకీయ చరిత్రలో ఎలాంటి మచ్చ లేని నేతగా వెంకయ్యకు పేరుంది.
తెలుగు, ఇంగ్లీష్, హిందీ, సంస్కృతం ఇలా అనేక భాషల్లో ఆయనకు పట్టుంది. చెప్పలేనంత సమాచారం ఆయన అమ్ముల పొదిలో ఉంది. అందుకనే ఆయన మోడీకి కుడి భుజంగా మెలుగుతూ వచ్చారు. తనకంటూ ఓ టీంను..మరో అనుచర సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తాను అనుకున్నారంటే సాధించేదాకా వదిలి పెట్టని మనస్తత్వం కలిగి ఉండడం వల్లనేమో ఆయన ఎంతో కాలం దేశ రాజకీయాల్లో చక్రం తిప్పగలిగారు.
ఏ అంశమైనా సరే దానిని అమూలాగ్రం తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఒక పట్టాన ఓటమిని ఆయన ఒప్పుకోరాయన. గెలుపు సాధించే దాకా నిద్రపోరు. ఇదీ వెంకయ్య మనస్తత్వం. నూతన ఉపరాష్ట్రపతి సక్సెస్ సీక్రెట్.
తాజా వార్తలు
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్‌బైజాన్‌లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!









