లైంగిక వేధింపులకు సంబంధించి అమెరికాలో భారత వైద్యుడి అరెస్టు
- August 06, 2017
లైంగిక వేధింపులకు సంబంధించిన ఆరోపణలతో అమెరికాలో విజకుమార్ కృష్ణప్ప అనే 28 ఏళ్ల భారత వైద్యుడిని అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. జులై 23న న్యూజెర్సీకి పయనమైన యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానంలో.. తాను నిద్రించి ఉండగా పక్క సీట్లో ఉన్న కృష్ణప్ప పలుమార్లు అసభ్యంగా తాకాడని 16 ఏళ్ల బాలిక ఆరోపించింది. విమాన సిబ్బందికి ఈ విషయం చెప్పి.. తన సీటు మార్పించుకున్నట్లు పేర్కొంది. ఇటు ప్రయాణ అనంతరం ఆమె కుటుంబం ఈ ఘటనపై ఫిర్యాదు చేసింది. అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ కృష్ణప్పపై కేసు నమోదు చేసింది. మైనర్‌పై లైంగిక వేధింపులకు సంబంధించిన ఆరోపణలతో కృష్ణప్పను అరెస్టు చేసినట్లు నెవార్క్ ఫెడరల్ కోర్టు రికార్డులు పేర్కొన్నాయి. బాండుపై ఆయనను విడుదల చేసి.. ఎలక్ట్రానిక్ పర్యవేక్షణలో ఉంచినట్లు తెలిపాయి. ఇటు కృష్ణప్ప తరఫు న్యాయవాది ఈ ఆరోపణలను తోసిపుచ్చారు.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







