హీరో పవన్ కల్యాణ్ కి ఫ్రెండ్ షిప్ డే రోజున సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన త్రివిక్రమ్

- August 07, 2017 , by Maagulf
హీరో పవన్ కల్యాణ్ కి ఫ్రెండ్ షిప్ డే రోజున సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన త్రివిక్రమ్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ లు బెస్ట్ ఫ్రెండ్స్.. వీరిద్దరి స్నేహం సినిమాలకతీతం.. అభిరుచులతో కలిసిన స్నేహం.. కాగా పవన్ కల్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న నేపద్యంలో స్నేహితుల దినోత్సవం రోజున త్రివిక్రమ్ ని కలవడం కుదరలేదట... కానీ త్రివిక్రమ్ మాత్రం పవన్ వద్దకు వెళ్ళి ఎప్పటిలాగే స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి... ఖరీదైన వాచ్ ని గిఫ్ట్ గా ఇచ్చాడట.. పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో రాజకీయాల్లో అడుగు పెడుతున్న సందర్భంలో ..  తన విలువైన సమయాన్ని పవన్ సమస్యలను తీర్చడానికి కృషి చేయాలని.. ఈ వాచ్ ని చూసినప్పుడల్లా నేను చెప్పిన మాటలు పవన్ కు గుర్తు కు రావాలని చెప్పాడు.  అంతేకాదు.. ఈ వాచ్ ని పవన్ చూసినప్పుడు మా ఇద్దరి మధ్య ఉన్న స్నేహం గుర్తుకు రావాలి అని త్రివిక్రమ్ ఈ వాచ్ ఈ గిఫ్ట్ గా వెనుక ఇవ్వడానికి గల రీజన్ చెప్పాడు. త్రివిక్రమ్ మాటలు విన్న పవన్ తప్పకుండా తన బాధ్యతలను నెరవేరుస్తానని తన స్నేహితుడికి మాట ఇచ్చాడట. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com