87 ఫుడ్‌ ఔట్‌లెట్స్‌కి ఝలక్‌

- August 07, 2017 , by Maagulf
87 ఫుడ్‌ ఔట్‌లెట్స్‌కి ఝలక్‌

రస్‌ అల్‌ ఖైమా మునిసిపాలిటీ, 87 ఫుడ్‌ ఔట్‌లెట్స్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఏడాది జూన్‌లో మొత్తం 1,329 షాప్‌లపై ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. పబ్లిక్‌ హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌ యాక్టింగ్‌ మేనేజర్‌ షైమా అల్‌ తునాజి మాట్లాడుతూ, తమ సిబ్బంది ఈ ఏడాది జూన్‌లో 385 తనిఖీలు నిర్వహించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా 33 కాస్మొటిక్‌ ఐటమ్స్‌, 59 ఫుడ్‌ ప్రోడక్ట్స్‌ని ధ్వంసం చేసినట్లు తెలిపారాయన. కొన్ని ఔట్‌లెట్స్‌కి జరీమానాలు విధించగా, మరికొన్ని ఔట్‌లెట్స్‌ మూసివేతకు నోటీసులు జారీ చేశారు అధికారులు. ఫుడ్‌ ఔట్‌లెట్స్‌ విషయంలో ఎలాంటి ఉల్లంఘనలకూ అవకాశమివ్వబోమని, ఎట్టి పరిస్థితుల్లోనూ చిన్న ఉల్లంఘనలకూ సీరియస్‌గా చర్యలుంటాయని అధికారులు స్పష్టం చేశారు. గత నెలలో రస్‌ అల్‌ ఖైమా మునిసిపాలిటీ 2,391 హెల్త్‌ కార్డ్స్‌ని కమర్షియల్‌ విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులకు జారీ చేసింది. స్లాటర్‌ హౌస్‌లో పలు జంతువుల్ని ఆరోగ్యకర పరిస్థితుల్లో వధించడం జరిగింది. జంతువుల ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి పొరపాట్లూ జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com