ఫేస్బుక్ కి దీటుగా అవే ఫీచర్స్ తో మనముందుకు రాబోతున్న వాట్సాప్

- August 07, 2017 , by Maagulf
ఫేస్బుక్ కి దీటుగా అవే ఫీచర్స్ తో మనముందుకు రాబోతున్న వాట్సాప్

వాట్సాప్‌ స్టేటస్‌ ఫీచర్‌కు యూజర్ల నుంచి వస్తున్న ఆదరణ అంతా ఇంతా కాదు. యూజర్లను విపరీతంగా ఆకట్టుకుంటున్న ఈ ఫీచర్‌కు అప్‌డేట్‌ చేయాలని వాట్సాప్‌ నిర్ణయించింది. ఫేస్‌బుక్‌ లాగా కలర్‌ఫుల్‌ టెక్ట్స్‌ అప్‌డేట్లు పోస్టు చేసేలా వాట్సాప్‌ తన ఫీచర్‌ను అప్‌డేట్‌ చేయాలనుకుంటోందని తెలుస్తోంది. ప్రస్తుతం దీన్ని ఆండ్రాయిడ్‌ బీటా యూజర్లకు అందుబాటులోకి కూడా తీసుకొచ్చిందట. వాట్సాప్‌ బీటా వెర్షన్‌ 2.17.291 కింద ఈ ఫీచర్‌ అందుబాటులో ఉందని, దీన్ని ప్రారంభించడం కోసం కొత్త స్టేటస్‌ అప్‌డేట్‌ను క్రియేట్‌ చేసుకోవాలని ఆండ్రాయిడ్‌పోలీస్‌ పేర్కొంది. దీంతో స్టేటస్‌లో ఏదైనా అక్షరాలను రాసిన తర్వాత వాటికి కలర్ బ్యాగ్రౌండ్ పెట్టడం, ఫాంట్ స్టెల్‌ను మార్చుకోవడం, ఎమోజీలను కలుపుకోవడం వంటివి కూడా ఇక నుంచి సులువుగా చేసుకోవచ్చు.
టెక్ట్స్‌ స్టేటస్‌ స్క్రీన్‌ ప్రస్తుతం మూడు ఆప్షన్లను కలిగి ఉందని, అవి ఫాంట్‌ మార్చుకోవడం, బ్యాక్‌గ్రౌండ్‌ కలర్‌ పెట్టుకోవడం, ఎమోజీ అని తెలిపింది. ఫేస్‌బుక్‌లో కలర్‌ఫుల్‌ టెక్ట్స్‌ అప్‌డేట్లకు అనూహ్య స్పందన ఉంది. అచ్చం అలానే వాట్సాప్‌ కూడా తన యూజర్లకు అందించబోతుంది. ఇప్పటికే సోషల్‌మీడియాలో వాట్సాప్‌ దూసుకెళ్తోంది. ఇది తీసుకొస్తున్న కొత్త కొత్త ఫీచర్లతో యూజర్లు కూడా విపరీతంగా పెరుగుతున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com