సూర్య మూవీ లో తమ్ముడు కార్తీక్

- August 07, 2017 , by Maagulf
సూర్య మూవీ లో తమ్ముడు కార్తీక్

అన్నయ్య మాస్‌ హీరో. తమ్ముడేమో సూపర్‌ హీరో. అయినా ఆ అన్నయ్య నిర్మించే చిత్రంలో తమ్ముడు హీరోగా నటించడానికి రెడీ అవుతున్నారు. ఆ స్టార్‌ హీరోలెవరో ఇప్పటికే అర్ధం అయ్యే ఉంటుంది. ఆ సోదరద్వయం సూర్య, కార్తీనే. ఈ ఇద్దరికీ హీరోగా ఎవరి ఇమేజ్‌ వారికుంది.
కాగా నటుడు సూర్య 2డీ ఎంటర్‌టెయిన్‌మెంట్‌ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించి చిత్రాలను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. తొలి ప్రయత్నంగా తన అర్ధాంగి జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన 36 వయదినిలే, ఆ తరువాత బాలల ప్రధాన ఇతివృత్తంతో తాను ఒక ముఖ్య భూమికను పోషించిన పసంగ–2 చిత్రాన్ని నిర్మించా రు. ఈ రెండు చిత్రాలు మంచి ఆదరణను పొందాయి. ప్రస్తుతం తన భార్య జ్యోతిక నాయికగా మగళీర్‌ మట్టుం చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా తాజాగా తన తమ్ముడు కార్తీ కథానాయకుడిగా చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
తన సంస్థలో ఇంతకు ముం దు పసంగ–2 చిత్రాన్ని తెరకెక్కించిన పాండిరాజ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ విషయాన్ని పాండిరాజ్‌ ఇటీవల వెల్లడించారు. కాగా ప్రస్తుతం కార్తీ ధీరన్‌ అధికారం ఒండ్రు చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ చిత్రం తరువాత తన అన్నయ్య సూర్య నిర్మించే చిత్రంలో నటించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ  ప్రొడక్షన్స్‌ కార్యక్రమాలు ఇప్పటికే ప్రారంభం అయ్యాయట. ఈ చిత్రానికి డీ.ఇమాన్‌ సంగీతం అందిస్తున్నారు. కార్తీ చిత్రానికి ఆయన సంగీతం అందించడం ఇదే ప్రథమం అవుతుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com