న్యూ స్మార్ట్ వీసా: సాంకేతిక సమస్యతో ఆలస్యం
- August 08, 2017
మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఆగస్ట్ 1 నుంచి న్యూ స్మార్ట్ వీసా సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. అయితే కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా ఈ న్యూ స్మార్ట్ వీసా సౌకర్యం అమలులో ఇబ్బందులు తలెత్తాయి. అతి త్వరలోనే ఆ ఇబ్బందుల్ని అధిగమిస్తామని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ పేర్కొంది. కేవలం పది నిమిషాల్లోనే వీసా పొందేలా ఈ కొత్త స్మార్ట్ వీసా సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం వివిధ శాఖలతో 'కనెక్ట్ చేసేందుకు' చర్యలు ముమ్మరం చేశామనీ, కొద్ది రోజుల్లోనే న్యూ స్మార్ట్ వీసా సౌకర్యం అందరికీ అందుబాటులోకి వస్తుందని అధికారులు తెలిపారు. అబుదాబీ సహా కొన్ని ఎమిరేట్స్‌లో ఈ కొత్త విధానం అమలు తీరు సరిగానే ఉందని అధికారులు చెబుతున్నారు. పాత, కొత్త విధానాల మధ్య చిన్నపాటి సమస్యలు ఇలాంటి సందర్భాల్లో మామూలేనని వారు తెలిపారు.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్‌సిఎం
- ఫ్రంట్‌లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







