50 దిర్హామ్‌లకే బుర్జ్ ఖలీఫాలో స్విమ్మింగ్
- August 08, 2017
దుబాయ్‌లో ఎండలు మండిపోతున్నాయి. 50 డిగ్రీలకు చేరుతున్న ఉష్ణోగ్రతలతో చల్లదనాన్ని ఆస్వాదించేందుకు ప్రతి ఒక్కరూ మొగ్గు చూపుతున్నారు. ఎక్కువగా స్విమ్మింగ్ పూల్స్ వైపే వెళుతున్నారంతా. ఈ నేపథ్యంలోనే బుర్జ్ ఖలీఫా, రూఫ్‌టాప్‌లో ఏర్పాటు చేసిన స్విమ్మింగ్ పూల్ సందర్శకులకు బంపర్ ఆఫర్స్‌తో ఆహ్వానం పలుకుతోంది. 150 దిర్హామ్‌ల ఖర్చుతో స్విమ్మింగ్‌ని ఎంజాయ్ చేయొచ్చు. ఇందులో 100 దిర్హామ్‌లకు వోచర్ అందిస్తారు. దాన్ని ఫుడ్, బెవరేజ్ ఐటమ్స్‌తో రిడీమ్ చేసుకోవడానికి వీలవుతుంది. అంటే కేవలం 50 దిర్హామ్‌లకే స్విమ్మింగ్‌ని ఎంజాయ్ చేయొచ్చన్నమాట. బుధవారం నుంచి శుక్రవారం వరకు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఇది అందుబాటులో ఉంటుంది. బుర్జ్ క్లబ్ వెబ్‌సైట్ ద్వారా మరిన్ని వివరాల్ని తెలుసుకోవచ్చు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్‌లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్‌లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్‌లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







