ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ సెక్టార్ ఉద్యోగులకు శుభవార్త

- August 09, 2017 , by Maagulf
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ సెక్టార్ ఉద్యోగులకు శుభవార్త

ఏపీ ప్రభుత్వ సెక్టార్ ఉద్యోగులకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. షెడ్యూల్‌ 9, 10 సంస్థల ఉద్యోగులకు 60 ఏళ్లకు పదవీ విరమణ అవకాశం కల్పిస్తూ సుప్రీం బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ మధ్యకాలంలో 60 ఏళ్ల వయస్సు నిండి రిటైరైన ఉద్యోగులకు సర్వీసు ప్రయోజనాలను కల్పించాలని ఉన్నతన్యాయస్థానం ఆదేశించింది. 58 ఏళ్లకే రిటైరై 60ఏళ్లు నిండని ఉద్యోగులను సర్వీసులోకి తీసుకోవాలని, సర్వీసులో ఉన్నవారిని 60 ఏళ్ల వరకు కొనసాగించాలని సుప్రీం తీర్పునిచ్చింది. సుప్రీంకోర్టు తీర్పుతో 150 సంస్థల ఉద్యోగులు ప్రయోజనం పొందనున్నారు. తీర్పుపై ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com