జెట్ ఎయిర్వేస్ బంపర్ ఆఫర్
- August 10, 2017
జెట్ ఎయిర్వేస్ తగ్గింపు ధరలను ప్రకటించింది. విమాన టికెట్ల కొనుగోలుపై 20-30శాతం డిస్కౌంట్ అందిస్తున్నట్టు గురువారం ప్రకటించింది. ఆగస్టు 11నుంచి 6 రోజులపాటు ఈ ప్రత్యేక సేల్ ద్వారా డిస్కౌంట్ ధరల్లో రెండు వైపులా (వన్ వే అండ్, రిటన్) టికెట్లను అందించనున్నట్టు ఎయిర్‌లైన్ ఒక ప్రకటనలో తెలిపింది.
ఎకానమీ టికెట్లపై 30 శాతం, ప్రీమియం ఛార్జీలపై 20 శాతం తగ్గించనున్నట్లు జెట్ ఎయిర్వేస్ తెలిపింది. ఈ ప్రమోషనల్ ఆఫర్ టికెట్ల ద్వారా దేశీయ విమానాల్లో సెప్టెంబర్ 5 నుంచి ప్రయాణాలకు చెల్లుబాటు అవుతుంది. అలాగే అంతర్జాతీయ విమానాల్లో సెప్టెంబర్ 15 నుంచి చెల్లుబాటు అవుతాయి. జెట్ ఎయిర్వేస్ నెట్ వర్క్ పరిధిలోని మొత్తం 44 దేశీయ, 20 అంతర్జాతీయ రూట్లలో తమ టికెట్లను బుక్ చేసుకోవచ్చని , రెండు వైపులా ప్రయాణాలకు ఈ తగ్గింపు వర్తిస్తుందని చెప్పింది.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్‌తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్‌కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









