24,000 మంది భారతీయులు మాత్రమే ఓటర్లుగా నమోదు
- August 13, 2017
భారతదేశంలో ఓటు వేసేందుకోసం విదేశాల్లోని భారతీయులు అతి తక్కువగా తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఇలా నమోదు చేసుకున్నవారి సంఖ్య 23,556 మాత్రమే ఉంది. కేరళకు చెందిన 364 మంది, పంజాబ్‌కి చెందిన 14 మంది మాత్రమే ఓటు హక్కు కోసం పేర్లను నమోదు చేసుకున్నట్లు ఎలక్షన్ కమిషన్ వివరాల ప్రకారం తెలియవస్తోంది. విదేశాల్లో ఉంటున్న వ్యక్తి, భారతీయ పౌరసత్వాన్ని మాత్రమే కలిగి ఉంటే భారతదేశంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం ఉంటుందని ఎన్నికల కమిషన్ చెబుతోంది. పాస్‌పోర్ట్‌లో ఉన్న వివరాల ప్రకారమే ఆయా వ్యక్తులు ఓటేయడానికి నియోజకవర్గాన్ని నిర్ణయిస్తారు. ఇదివరకటి నిబంధనల ప్రకారం ఓటు హక్కుని ప్రవాస భారతీయులు వినియోగించుకోవడం ఓ ప్రసహనంగా ఉండేది. అయితే ఇప్పుడు వాటిని కొంతమేర సడలించడంతో, ప్రవాస భారతీయులూ సులువుగా తమ ఓటుకు హక్కుని వినియోగించుకోవచ్చు. దీనికి సంబంధించిన వివరాల్ని ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్‌లో పొందుపర్చారు.
తాజా వార్తలు
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!







