పశ్చిమ ఆఫ్రికాలోని బుర్కినాఫాసోలో ఉగ్రదాడి.. 17 మంది మృతి
- August 14, 2017
8మందికి గాయాలు
పశ్చిమ ఆఫ్రికాలోని బుర్కినా ఫాసో దేశంలో ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. బుర్కినా ఫాసో రాజధాని వాగాదువోలో ఉన్న టర్కీస్ రెస్టారెంట్లోకి స్థానిక కాలమాన ప్రకారం ఆదివారం 9 గంటల సమయంలో దుండగులు చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 17 మంది అక్కడికక్కడే మృతిచెందగా... మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు.
మృతుల్లో వివిధ దేశాలకు చెందినవారు ఉన్నారని ఆఫ్రికన్ మీడియా వర్గాలు వెల్లడించాయి. క్షతగాత్రుల్ని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రులకు తరలించారు. ఈ దాడి కారణంగా వాగాదుగో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. ఈ ఘటనపై క్షేత్రస్థాయిలో విచారణ జరుపుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అ దాడికి బాధ్యత వహిస్తూ ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటన చేయలేదని పోలీసులు వెల్లడించారు.
బుర్కినాఫాసోలో గత రెండేళ్ల కాలంలో ఉగ్రదాడి జరగడం ఇది రెండోసారి. గతేడాది జనవరిలో ఓ కేఫ్‌పై దాడి చేసిన ఉగ్రవాదులు 30 మందిని పొట్టపెట్టుకున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







