అబుదాబీలో ఇండియా, పాకిస్తాన్ స్వాతంత్య్ర దినోత్సవాల సెలబ్రేషన్స్
- August 15, 2017
ఆగస్ట్ 14న పాకిస్తాన్ స్వాతంత్య్ర దినోత్సవం కావడం, ఆగస్ట్ 15వ తేదీ భారతదేశ స్వాతంత్య్ర దినోత్సవం కావడంతో అబుదాబీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో అధికారులు, ఆయా దేశాల నుంచి వచ్చినవారికి ప్రత్యేకంగా స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ పలు కార్యక్రమాలు చేపట్టారు. ఫ్లాష్ మాబ్స్, ఆయా దేశాల పతాకాలతో కూడిన బెలూన్స్‌ని ఎగరవేయడం వంటివి ఎయిర్‌పోర్ట్‌లో ఏర్పాటు చేశారు. దీంతో ఇరు దేశాలకు చెందినవారూ అబుదాబీ విమానాశ్రయంలో తమకు దక్కిన విశేష ఆదరణకు ముగ్దులయ్యారు. ప్రయాణీకుల్లో 50 మందిని ఎంపిక చేసి, వారికి లగ్జరీ ట్రావెల్ ఎక్స్‌పీరియన్స్‌ని ప్రత్యేక ఆఫర్ కింద అందించారు. ఇండియా, పాకిస్తాన్ తమకు అత్యంత విలువైన ట్రావెల్ మార్కెట్స్ అనీ, ఆయా దేశాల పట్ల తమకు ప్రత్యేకమైన గౌరవం వుందని ఈ కారణంగానే తాము ప్రత్యేక ఏర్పాట్లు ఆయా దేశాల స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేశామని యాక్టింగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అబ్దుల్ మజీద్ అల్ ఖూరి చెప్పారు.
తాజా వార్తలు
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!







