కంచె:రివ్యూ
- October 23, 2015
మెగా కుటుంబం లో నాగబాబు వారసుడిగా తెరంగేట్రం చేసిన 'వరుణ్ తేజ్' తన మొదటి సినిమా 'ముకుందా' ద్వారా పర్వలేదనిపించినా ఈ సారి దర్శకుడు 'క్రిష్' తో కలిసి ఓ వైవిధ్యభరితమైన చిత్రం 'కంచె' ద్వారా మనముందుకి వచ్చాడు. మరి ఈ సినిమాతో 'వరుణ్' కెరీర్ మెగా ట్రాక్ ఎక్కేస్తుందా లేదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. విశ్లేషణ.. 'కంచె' చిత్ర కథ 1930 ల కాలం నాటి ప్రేమ కథ. హరి అనే ఓ నిమ్న జాతి వర్గీయుడు..వాళ్ళ ఊరిలోనే సీతాదేవి అనే అగ్రకులానికి చెందిన అమ్మాయిని ప్రేమిస్తాడు, కానీ వీరి ప్రేమను సీతాదేవి కుటుంబం తో పాటు ఊళ్ళోని మిగిలిన వారు కూడా వ్యతిరేకిస్తారు. దీంతో కులాలు..మతాలు మనుషుల కర్తవ్యాన్ని బట్టి విభచించారు కానీ పెత్తనం చెలాయించడానికి కాదు అని పెద్దలను ఎదిరించి మరీ సీతను పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి తర్వాత సీత అన్నయ్యకు హరి కి జరిగిన గొడవలో సీత ప్రమాదవశాత్తు చనిపోతుంది. ఆ తర్వాత సీత అన్నయ్య అలాగే హరి ఇద్దరు ఆర్మీ లో చేరి రెండవ ప్రపంచ యుద్దానికి వెళ్ళడం...ఆ యుద్ధం కుడా కులాలు మతాల కోసం జరుగుతుంది అని గుర్తించడం, వీరిద్దరూ కలసి యుద్దంలో ఎం చేసారు అనేది మిగిలిన కథ. రెండు విధాలుగా సాగనున్న కథ.. ప్రధానంగా 'కంచె' చిత్ర కథ 'క్రిష్' స్టైల్లో భూతకాలం..వర్తమాన కాలం అనే రెండు విధాలుగా సాగుతుంది. రెగ్యులర్ ఫార్మాట్ లో కాకుండా ఇలా వినూత్నంగా తెలుగు సినిమాలకు భిన్నంగా హాలీవుడ్ తరహాలో సినిమాని చెప్పాలనుకున్న 'క్రిష్' అభినందనీయుడే. కానీ కథ పూర్తిగా 1936 నాటి రెండవ ప్రపంచ యుద్దానికి సంబంధించినది కావడం అది పెద్దగా ప్రేక్షకులకు తెలియకపోవడం, తెలిసినా ఆ కథను జనరంజకంగా చెప్పలేక పోవడం ఈ చిత్రం లోని ప్రధాన మైనస్. రొటీన్ కి భిన్నంగా ఈ చిత్ర కథ ఉన్నా సామాన్యులకు మాత్రం ఈ సినిమా చాలా దూరంలో ఉంది. టెక్నికల్ గా హై స్టాండర్డ్స్ లో ఈ సినిమా సాగినా, చిత్రంలోని ప్రధాన అంశం, ప్రేక్షకులకు కాస్త కూడా ఎక్కకపోవచ్చు. పైగా ప్రేక్షకులను ఎమోషనల్ గా కనెక్ట్ చేయడానికి కావలిసినంత స్కోప్ ఉన్నప్పటికీ దర్శకుడు మాత్రం చాల సన్నివేశాలను చాలా లైట్ గా తీశాడు.అసలే మూవీ లాగ్ అవుతుందేమో అనుకుంటున్నా ప్రేక్షకులకు మధ్యలో వచ్చే పాటలు మరింత ఇబ్బంది పెడతాయి. ఇక నటీనటుల పెర్ఫార్మన్స్ విషయానికి వస్తే హీరో 'వరుణ్ తేజ్' కి వందకు వంద మార్కులు వేయచ్చు. రెండవ సినిమా అయినా పాత్రోచితంగా చక్కటి నటనను కనబర్చాడు. హీరోయిన్ 'ప్రగ్య జైస్వాల్' కూడా 'వరుణ్' తో పోటీ పడుతూ పర్వాలేదనిపించింది. ఇక మిగిలిన నటీనటుల విషయానికి కుడా వస్తే గొల్లపూడి మారుతీరావు, షావుకారు జానకి, సింగీతం శ్రీనివాసరావు, అవసరాల శ్రీనివాస్ వంటి నటులతో సినిమాకి మంచి రిచ్ నెస్ తీసుకొచ్చాడు క్రిష్. ఇక టెక్నికల్ అంశాలు చూస్తే జ్ఞాన శేఖర్ అందించిన సినిమాటోగ్రఫి అధ్బుతం. సినిమాలోని ప్రతి ఫ్రేం చెక్కినట్లు తీర్చిదిద్దాడు. అలాగే రెండవ ప్రపంచానికి సంబంధించిన యుద్ద సన్నివేశాలు కానీ వారి వస్త్రధారణ కానీ అచ్చు గుద్దినట్లు ఏ మాత్రం తేడ రాకుండా చాల జాగ్రత్తలు తీసుకున్నారు. అలాగే చిరంతాన్ బట్ అందిన సంగీతం కుడా పాతకాలం నాటికి చక్కగా సరిపోయింది. చివరగా ఈ సినిమా గురించి మాట్లాడుకుంటే కమెర్షియల్ గా విజయం సాధించే అవకాశాలు ఈ చిత్రానికి లేనప్పటికీ ఓ గొప్ప ప్రయత్నంగా ఓ మంచి చిత్రంగా మాత్రం చెప్పుకోవచ్చు. సో రొటీన్ చిత్రాలతో విసిగి వేసారిన వారు గొప్ప పెర్ఫార్మన్స్ లు కావాలనుకున్న వారు ఈ 'కంచె చిత్రాన్ని హ్యాపీగా ఓ సారి చూడచ్చు. ప్లస్ పాయింట్స్ : వరుణ్ తేజ్ పెర్ఫార్మన్స్.. యుద్ధ సన్నివేశాలు..సినిమాటోగ్రఫీ..బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మైనస్ పాయింట్స్ : కథ..స్లో నేరేషన్..ఎమోషన్స్ మిస్ అవడం రేటింగ్ : 3/5..
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







