20 అడుగుల మురుగునీటి గోతిలో పడిన బాలుడిని రక్షించిన పోలీసులు

- August 16, 2017 , by Maagulf
20 అడుగుల మురుగునీటి గోతిలో పడిన బాలుడిని రక్షించిన పోలీసులు

మన తెలుగు రాష్ట్రాలలో పూడ్చివేయబడని బోరు బావిలో పిల్లలు పడిపోవడం తరచూ జరుగుతుంటుంది. గల్ఫ్ ప్రాంతంలో సైతం బుడతలు డ్రైనేజీ గుంతలలో జర్రున జారిపోతున్నారు. అల్ మురిఫీయా ప్రాంతం అల్ ఐన్ లో బుధవారం  ఒక మురుగునీటి గొయ్యిలో పడిపోయిన ఎమిరాటీ బాలుడిని పోలీసులు కాపాడారు. ఆ ప్రమాదం గురించి  ఆపరేషన్ రూమ్ కు  సాయంత్రం 5 గంటల సమయంలో ఒక ఫోన్ కాల్ వచ్చింది. దీంతో వెంటనే అల్ మక్ మరియు బస్నాడ్ పోలీసు స్టేషన్ల నుండి విపత్తు నివారణ జట్లు స్పందించి సంఘటనా స్థలానికి చేరుకొన్నాయి.అల్ ఐన్ నుండి పౌర రక్షణ బృందం 20 మీటర్ల లోతైన డ్రైనేజీ రంధ్రం నుండి ఆ బాలుడిని సురక్షితంగా వెలుపలికి తీసుకువచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com