ఇక పెట్రోల్ బంకుల్లోనూ కూడా మెడికల్ స్టాల్ల్స్
- August 16, 2017
పెట్రోల్ బంకుల్లో జన్ ఔషధి మెడికల్ స్టోర్స్‌ను ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ప్రాణ రక్షక ఔషధాలను చవక ధరలకు ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర పెట్రోలియం, చమురు శాఖల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. పెట్రోల్ బంకుల్లో ఎల్ఈడీ బల్బుల విక్రయానికి ఆయిల్ రిటైలర్లతో ఎనర్జీ ఎఫీషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ ఒప్పందం చేసుకున్న నేపథ్యంలో త్వరలో జనరిక్ దుకాణాలనూ అందుబాటులోకి తేవాలని యోచిస్తున్నట్టు మంత్రి పేర్కొన్నారు.
జనరిక్ స్టోర్స్ నిర్వహణకు క్వాలిఫైడ్ ఫార్మసిస్ట్ అవసరం ఉన్నందున ఫార్మసిస్ట్‌ల కొరతను అధిగమించి ఈ దుకాణాలను ముందుకు తీసుకువెళ్లడంపై ప్రభుత్వం దృష్టి సారించినట్టు అధికారులు చెబుతున్నారు. పెట్రోల్ బంకుల్లో ఈ తరహా ఔట్లెట్లను అనుమతించడంతో యువతకు ఉపాధి అవకాశాలూ మెరుగవుతాయని ప్రభుత్వం భావిస్తున్నట్టు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







