సూపర్ స్టార్ రజనీ అభిమానులకు పండుగే
- August 17, 2017
కాలా'పై ధనుష్
'కాలా' చిత్రంతో సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులు పండుగ చేసుకోవడం ఖాయమని ఆ చిత్ర నిర్మాత, నటుడు ధనుష్ పేర్కొన్నారు. ఈ సినిమా గురించి అభిమానులు సామాజిక మాధ్యమాల ద్వారా అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. నిర్మాణ పనులు దాదాపు 60 శాతం పూర్తయినట్లు తెలిపారు. సినిమా అద్భుతంగా వచ్చిందన్నారు. ఇది రజనీ అభిమానులకు అమితానందం కలిగిస్తుందని పేర్కొన్నారు. తాను కథానాయకుడిగా నటించి విజయవంతంగా నడుస్తున్న 'వేలయిల్లా పట్టదారి-2' గురించి కూడా ధనుష్ ప్రస్తావించారు. ఈ చిత్రానికి కూడా సీక్వెల్‌ను తప్పక తీస్తామని చెప్పారు. బహుశా 2018లో ఆ పనులు ప్రారంభం అవుతాయని చెప్పారు. ఆ మరుసటి ఏడాదికి చిత్రం పూర్తవుతుందని పేర్కొన్నారు. సౌందర్య రజనీకాంత్ దర్శకత్వంలో ధనుష్, కాజోల్, అమలా పాల్, సముద్రకనిలు నటించిన 'వేలయిల్లా పట్టదారి -2' ప్రస్తుతం వసూళ్ల వర్షం కురిపిస్తోంది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







