సూపర్ స్టార్ రజనీ అభిమానులకు పండుగే

- August 17, 2017 , by Maagulf
సూపర్ స్టార్ రజనీ అభిమానులకు పండుగే

కాలా'పై ధనుష్‌ 
'కాలా' చిత్రంతో సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ అభిమానులు పండుగ చేసుకోవడం ఖాయమని ఆ చిత్ర నిర్మాత, నటుడు ధనుష్‌ పేర్కొన్నారు. ఈ సినిమా గురించి అభిమానులు సామాజిక మాధ్యమాల ద్వారా అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. నిర్మాణ పనులు దాదాపు 60 శాతం పూర్తయినట్లు తెలిపారు. సినిమా అద్భుతంగా వచ్చిందన్నారు. ఇది రజనీ అభిమానులకు అమితానందం కలిగిస్తుందని పేర్కొన్నారు. తాను కథానాయకుడిగా నటించి విజయవంతంగా నడుస్తున్న 'వేలయిల్లా పట్టదారి-2' గురించి కూడా ధనుష్‌ ప్రస్తావించారు. ఈ చిత్రానికి కూడా సీక్వెల్‌ను తప్పక తీస్తామని చెప్పారు. బహుశా 2018లో ఆ పనులు ప్రారంభం అవుతాయని చెప్పారు. ఆ మరుసటి ఏడాదికి చిత్రం పూర్తవుతుందని పేర్కొన్నారు. సౌందర్య రజనీకాంత్‌ దర్శకత్వంలో ధనుష్‌, కాజోల్‌, అమలా పాల్‌, సముద్రకనిలు నటించిన 'వేలయిల్లా పట్టదారి -2' ప్రస్తుతం వసూళ్ల వర్షం కురిపిస్తోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com