హైదరాబాద్ లో మోడల్స్‌తో హైటెక్ వ్యభిచారం
- August 17, 2017
హైదరాబాద్ పోలీసులు ఇటీవల ఓ సెక్స్ రాకెట్ ని ఛేదించి షాక్ తిన్నారు. సంజయ్ అనే వ్యక్తి కోల్‌కతా కేంద్రంగా ఏకంగా 50 వెబ్ సైట్లు నిర్వహిస్తూ హైటెక్ వ్యభిచార దందా కొనసాగిస్తున్నాడని తెలిసి వాళ్ళు నిర్ఘాంతపోయారు. ఈ సైట్లలో పని చేసే ఉద్యోగుల పనల్లా తమ " కేంద్రానికి " వచ్చే అమ్మాయిల ఫోటోలను ఎప్పటికప్పుడు వివిధ వెబ్ సైట్లలో పోస్ట్ చేయడమేనట ! అంతర్ రాష్ట్ర వ్యభిచార ముఠా నిర్వాహకుడైన సంజయ్ తన ఉచ్చులో పడే యువతులకు వారానికి 2 లక్షలు ఇచ్చేవాడని, పైగా వారికి ఫ్లైట్ టికెట్, ఫైవ్ స్టార్ హోటల్ లో బస..ఇలా అన్ని సౌకర్యాలూ కల్పిస్తున్నాడట..
హైదరాబాద్ మాదాపూర్ లోని ఓ వ్యభిచార గృహంపై పోలీసులు దాడి చేసి భార్యా భర్తలైన రాజేష్ పర్వాల్, ఆర్తీ పర్వాల్ ని అరెస్ట్ చేసినప్పుడు.. సంజయ్ గురించి కూడా వాళ్ళు చెప్పారు. హైదరాబాద్, బెంగుళూరు కమిషనరేట్ పరిదుల్లోని పలు చోట్ల దాడులు చేసి మొత్తం ఏడుగురు వ్యభిచార గృహ నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. కోల్‌కతాలో ఉన్న సంజయ్‌ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఫేస్బుక్, వాట్సాప్, టెలిగ్రామ్‌లలో సంజయ్ ప్రత్యేకంగా గ్రూప్‌లు క్రియేట్ చేశాడట.
ఈవెంట్ మోడల్స్, డ్యాన్సర్లు, జూనియర్ మహిళా ఆర్టిస్టులు.. ఇలా చాలామంది యువతులు ఇతని ఉచ్చులో పడినట్టు తెలిసింది.
తాజా వార్తలు
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!







