ముగ్గురి తలలు నరికేసిన అల్ షబాబ్ ఉగ్రవాదులు
- August 18, 2017
లండన్ : కెన్యా ఉత్తర తీరప్రాంతంలోని లామూ కౌంటీలో ఇస్లాం ఉగ్రవాదులు శుక్రవారంనాడు ముగ్గురు పౌరులను అత్యంత కిరాతకంగా తలలు నరికి చంపారు. ఇళ్లు తగులబెట్టారు. విటూ పట్టణం సమీపంలోని మలేలి గ్రామంలో జరిగిన ఈ పాశవిక దాడి అల్ షబాబ్ ఉగ్రవాదాల పనిగా అనుమానిస్తున్నట్టు లామూ కౌంటీ కమిషనర్ గిల్బర్ కితియో తెలిపారు. ఇదే గ్రామంలో మూడు ఇళ్లకు కూడా ఉగ్రవాదులు నిప్పుపెట్టినట్టు తీరప్రాంత పోలీసు అధికారి ఒకరు తెలిపారు. గురువారం అర్థరాతి సాయుధులు స్థానికులపై విరుచుపడ్డారని, వారిని ఇళ్లలోంచి బైటకు లాక్కొచ్చి పాశవికంగా నరికి చంపారని ఆయన చెప్పారు. గత కొన్నేళ్లుగా అల్ షబాబ్ మిలిటెంట్లు పలు మార్లు పాశవిక దాడులు జరిపినప్పటికీ తలలు నరకిచంపిన ఘటనలు మాత్రేం అరుదే. అల్ షబాబ్ ఉగ్రసంస్థ గత జూలైలోనూ లామూ కౌంటీలోని మరో గ్రామంపై దాడులు జరిపి తొమ్మిది మందిని తలలు నరికి చంపింది. అల్‌ఖైదా ఉగ్రసంస్థతో సంబంధాలున్న అల్ షబాబ్ కెన్యా దళాలపై ప్రతీకారం తీర్చుకుంటామని గతంలో పలుమార్లు ప్రకటించింది. అల్ షబాబ్ ఉగ్రవాదులపై పోరాటానికి 2011లో సోమాలియా సరిహద్దుల్లోకి కెన్యా బలగాలను పంపడంపై అల్ షబాబ్ గుర్రుమంటోంది.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







