అమెరికాలో అరుదైన స్థానం సంపాదించిన గుంటూరోడు

- August 19, 2017 , by Maagulf
అమెరికాలో అరుదైన స్థానం సంపాదించిన గుంటూరోడు

 అమెరికాలో తెలుగుతేజం మెరిసింది. ప్రతిష్ఠాత్మక స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా గుంటూరు వాసికి అరుదైన అవకాశం దక్కింది. వర్సిటీలోని వ్యాస్కులర్‌ సర్జన్‌ విభాగంలో అమెరికాయేతర వ్యక్తిగా గుంటూరులోని బ్రాడీపేటకు చెందిన కార్తీక్‌ మిక్కినేని ఎంపికయ్యారు. గుంటూరు మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన కార్తీక్‌ న్యూయార్క్‌లోని విల్‌ కార్నెల్‌ మెడికల్‌ కళాశాలలో ఏడాది పాటు ఉన్నత విద్యనభ్యసించారు. అనంతరం ఫిట్స్‌బర్గ్‌ యూనివర్సిటీలో వ్యాస్కులర్‌ సర్జరీలో పీజీ పూర్తి చేశారు. ఏడాదికి రూ.2.08 కోట్ల ప్యాకేజీతో మూడేళ్ల పాటు యూనివర్సిటీ ఒప్పందం చేసుకుందని ఈ సందర్భంగా కార్తీక్‌ 'ఆంధ్రజ్యోతి'కి తెలిపారు. మూడేళ్ల అనంతరం తాను అంగీకరిస్తే ఒప్పందాన్ని పొడిగిస్తారన్నారు. మూడేళ్ల తరువాత నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ఆస్పత్రి స్థాపించి సేవలు చేయాలని భావిస్తున్నాని అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com