సౌదీ మక్కా హోటల్ లో అగ్నిప్రమాదం... ఖాళీ చేసిన హజ్ యాత్రికులు

- August 21, 2017 , by Maagulf
సౌదీ మక్కా హోటల్ లో అగ్నిప్రమాదం... ఖాళీ చేసిన హజ్ యాత్రికులు

రియాద్: సౌదీ అరేబియా నగరం మక్కాలోని ఒక హోటల్ లో సోమవారం అగ్ని ప్రమాదం జరిగింది.వార్షిక హజ్ యాత్ర కోసం 2 లక్షల మంది ఈ పవిత్ర కార్యక్రమానికి హాజరవ్వగా, అకస్మాత్తుగా ఏర్పడిన అగ్ని ప్రమాదం కారణంగా  సోమవారం వారినందరిని అక్కడ నుంచి ఖాళీ చేయించినట్లు సివిల్ రక్షణ ప్రతినిధి నయఫ్ అల్-షరీఫ్ తెలిపారు. ఈ అగ్ని ప్రమాదంలో ఏ ఒక్కరికీ ఎటువంటి గాయాలు కాలేదని ఆయన తెలిపారు. అజాజియా జిల్లాలో మక్కాలోని ఒక హోటల్ ఎనిమిదవ అంతస్థులో ఎయిర్ కండిషన్ యూనిట్ లో  దురదృష్టవశాత్తు మంటలు వెలువడ్డాయి. ఈ హోటల్ లో  600 మంది నివాసితులు, వీరిలో చాలామంది టర్కీ మరియు యెమెన్  నుండి హజ్ తీర్ధయాత్రకు వచ్చారు. మంటలను అదుపు చేసిన తర్వాత వారంతా  హోటల్ తిరిగి వచ్చినట్లు షరీఫ్ చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com