సౌదీ మక్కా హోటల్ లో అగ్నిప్రమాదం... ఖాళీ చేసిన హజ్ యాత్రికులు
- August 21, 2017
రియాద్: సౌదీ అరేబియా నగరం మక్కాలోని ఒక హోటల్ లో సోమవారం అగ్ని ప్రమాదం జరిగింది.వార్షిక హజ్ యాత్ర కోసం 2 లక్షల మంది ఈ పవిత్ర కార్యక్రమానికి హాజరవ్వగా, అకస్మాత్తుగా ఏర్పడిన అగ్ని ప్రమాదం కారణంగా సోమవారం వారినందరిని అక్కడ నుంచి ఖాళీ చేయించినట్లు సివిల్ రక్షణ ప్రతినిధి నయఫ్ అల్-షరీఫ్ తెలిపారు. ఈ అగ్ని ప్రమాదంలో ఏ ఒక్కరికీ ఎటువంటి గాయాలు కాలేదని ఆయన తెలిపారు. అజాజియా జిల్లాలో మక్కాలోని ఒక హోటల్ ఎనిమిదవ అంతస్థులో ఎయిర్ కండిషన్ యూనిట్ లో దురదృష్టవశాత్తు మంటలు వెలువడ్డాయి. ఈ హోటల్ లో 600 మంది నివాసితులు, వీరిలో చాలామంది టర్కీ మరియు యెమెన్ నుండి హజ్ తీర్ధయాత్రకు వచ్చారు. మంటలను అదుపు చేసిన తర్వాత వారంతా హోటల్ తిరిగి వచ్చినట్లు షరీఫ్ చెప్పారు.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







