తమిళనాడు చెన్నై లో బిగ్‌బాస్ హోస్ట్‌పై పరువునష్టం దావా
- August 21, 2017
విలక్షణ నటుడు, తమిళ బిగ్‌బాస్ షో వ్యాఖ్యాత కమల్‌హాసన్‌పై క్రిమినల్ పరువునష్టం దావా దాఖలైంది. జూలై 14న ప్రసారమైన 'బిగ్‌బాస్' షోలో ఇసాయి వెల్లాలర్ సామాజికవర్గాన్ని కించపరిచేలా వ్యవహరించారని ఆరోపిస్తూ చెన్నై మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో సోమవారం ఫిర్యాదు దాఖలైంది.
ఇసాయి వెల్లాలర్ సామాజికవర్గం ప్రజలు పిల్లనగ్రోవిని దేవుడిలా భావిస్తారని, కానీ, బిగ్‌బాస్ షోలో మాత్రం పిల్లనగ్రోవిని అవమానపరుస్తూ చూపించారని, దానితో నటుడు శక్తి ఆటలాడరని, బిగ్‌బాస్ సభ్యులు పిల్లనగ్రోవిని డైనింగ్ టేబుల్‌పై పెట్టుకొని భోజనం చేశారని, వేణువుతో ఇలా వ్యవహరించడం తమ మనోభావాలను దెబ్బతీసిందని పిటిషనర్ తన వ్యాజ్యంలో పేర్కొన్నారు. న్యాయమూర్తి ఈ కేసు విచారణను సెప్టెంబర్ 1వ తేదీకి వాయిదా వేశారు.
తాజా వార్తలు
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!









