ఈనెల 23 నుంచి భారీ వర్ష సూచన

- August 21, 2017 , by Maagulf
ఈనెల 23 నుంచి భారీ వర్ష సూచన

 మయన్మార్‌ తీరంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. మధ్యప్రదేశ్‌ పరిసర ప్రాంతాల్లో ఉన్న అల్పపీడనం దిశను ఉత్తరాదికి మళ్లే అవకాశముందని వాతావరణశాఖ అంచనా. దీంతో ఉపరితల ఆవర్తనం పడమటి దిశగా కదిలి రాష్ట్రంవైపు వచ్చే అవకాశాలున్నాయని ఆ శాఖ వెల్లడిస్తోంది. దీని ప్రభావంతో ఈనెల 23 నుంచి 3 రోజుల పాటు కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని విశాఖ వాతావరణ కేంద్రం పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రం మీదుగా ద్రోణి కొనసాగుతోందని తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com