షార్జా బుక్‌ ఫెస్టివల్‌ ఎప్పుడంటే

- August 22, 2017 , by Maagulf
షార్జా బుక్‌ ఫెస్టివల్‌ ఎప్పుడంటే

షార్జాలో బుక్‌ ఫెస్టివల్‌ కోసం పుస్తక ప్రియులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తుంటారు. ఈ సీజన్‌లో బుక్‌ ఫెస్టివల్‌ ఎప్పుడు జరుగుతుందా? అని ఎదురుచూసినవారికి శుభవార్త. నవంబర్‌ 1 నుంచి 11వ తేదీ వరకు షార్జాలోని ఎక్స్‌పో సెంటర్‌లో బుక్‌ ఫెస్టివల్‌ జరుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఆధర్స్‌, పబ్లిషర్స్‌ ఈ బుక్‌ ఫెస్టివల్‌లో సందడి చేయనున్నారు. వేలాది, లక్షలాది పుస్తకాలు ప్రదర్శన, మరియు అమ్మకానికి అందుబాటులో ఉంటాయి. మూడున్నర దశాబ్దాల నుంచి ఈ బుక్‌ ఫెయిర్‌ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని షార్జా బుక్‌ అథారిటీ ఛైర్మన్‌ అహ్మద్‌ అల్‌ అమెరి చెప్పారు. బుక్‌ఫెయిర్‌ సందర్భంగా పలు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు నిర్వాహకులు తెలిపారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com