ఎయిర్ ఏసియా వారి డిస్కౌంట్ ఆఫర్లు
- August 22, 2017
మలేషియా బడ్జెట్ ఎయిర్‌లైన్ ఎయిర్ ఏసియా దేశీయ ప్రయాణికుల కోసం ఫ్లాష్ విక్రయాలను ప్రకటించింది. ఎంపిక చేసుకున్న మార్గాల్లో వన్ వే (అన్నీ కలిపి) రూ.999 ధరలో విమాన టికెట్లను ఆఫర్ చేస్తోంది. ఫిబ్రవరి 26, 2018 నుంచి ఆగస్టు 28, 2018 వరకు ప్రయాణాల కోసం ఆ డిస్కౌంట్ ధరలను అందిస్తోంది.
ప్రమోషనల్ స్కీమ్‌లో భాగంగా ‘7 డేస్ మ్యాడ్ డీల్స్’ పేరిట మంగళవారం ఈ ఆఫర్‌ను తమ అధికారిక వెబ్సైట్లో షేర్ చేసింది. ఈ ఆఫర్ 2018 ఫిబ్రవరి 26 నుంచి ఆగస్టు 28 మధ్య వర్తించనుంది. ఈ రోజు నుంచి ఆగస్టు 27 వరకు టికెట్లు బుక్ చేసుకోవచ్చని తెలిపింది. పరిమిత కాల వ్యవధిలో ఎంపిక చేసిన వన్-వే విమానాలకు టికెట్ ధరను రూ.999గా పేర్కొంది.
అంతే కాకుండా ఎయిర్ఏషియా దేశంలో పలు ప్రాంతాలకు ప్రయాణించే వారి కోసం ఆఫర్లు ప్రకటించింది. ఎంపిక చేసిన విమానాల్లోనే ఈ స్కీమ్ వర్తిస్తోందని, సీట్లు పరిమిత సంఖ్యలో ఉన్నాయని ఎయిర్ ఏషియా ప్రతినిధులు తెలిపారు. వెబ్, మొబైల్ యాప్ ద్వారా ఈ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. కోల్‌కతా-బగ్దోగ్రా టికెట్ ధర రూ.999 కాగా, భువనేశ్వర్-కోల్‌కతా, గోవా-బెంగళూరు, గువాహటి-ఇంఫాల్, హైదరాబాద్-బెంగళూరు, కొచ్చి-బెంగళూరు మధ్య టికెట్ ధర రూ.1,099గా, అలాగే పుణె-బెంగళూరు, విశాఖపట్నం-బెంగళూరు మధ్య ధరను రూ.1,499గా ఉండనుంది. దీంతోపాటు కొన్ని అంతర్జాతీయ విమాన టిక్కెట్లకు ప్రారంభ ధరను రూ.3,399గా నిర్ణయించింది. కౌలాలంపూర్-కొచ్చి, కౌలాలంపూర్-తిరుచ్చిరాపల్లి మధ్య టికెట్ల ధరను తగ్గించినట్లు పేర్కొంది.
మరోవైపు భారీ మార్కెట్ క్యాప్ తో అద్భుత ప్రదర్శన కనబర్చే టాప్ లిస్టెడ్ కంపెనీలకిచ్చే అవార్డును సంస్థ దక్కించుకుంది. ఎడ్జ్ మీడియా అందించే ఎడ్జ్ బిలియన్ రింగింట్ క్లబ్ అవార్డును స్వీకరించినట్టు ఎయిర్ ఏసియా ట్విట్టర్‌ద్వారా వెల్లడించింది.
తాజా వార్తలు
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు







