బహరేన్ లో నేల రాలిన తెలంగాణ యువకుడు
- August 23, 2017
బహరేన్: తెలంగాణ యువకుడు కామారెడ్డి జిల్లా, గాంధారి మండలం, పోతంగల్ కలాన్ గ్రామానికి చెందిన మార్కంటి బాబు వయస్సు 34 పాస్పోర్ట్ నెంబర్ M9743802, బహరేన్ లో ఒక్క ప్రైవేట్ కంపెనీ లో గత 10 సంవత్సరాల నుండి లేబర్ గా విధులు నిర్వహిస్తు తేదీ 8 ఆగస్ట్ 2017న ఉదయం 06:00 గంటలకు డ్యూటీ టైంలో రోడ్ క్రాష్ చేస్తుండగా అకస్మాత్తుగా జరిగిన రోడ్డు ఆక్సిడెంట్ ప్రమాదంలో తన నిండు ప్రాణాలను కోల్పోయాడు, వారి అకాల మరణం చాల బాధాకరం, మృతిచెందిన బాబుకు, భార్యతో పాటు ఒక కూతురు, ఒక కుమారుడు ఇద్దరు పిల్లలు ఉన్నారు, అతని మరణంతో పెద్ద దిక్కును కోల్పోయింన ఆ పేద కుటుంబము.
మార్కంటి బాబు మృతదేహంనీ స్వగ్రామానికి పంపించే విషయాన్ని అతని తోటి కంపెనీ లో పని చేస్తున్న స్నేహితులు సాయన్న, ఆంజనేయులు, ఈ విషయం ఎన్నారై టీఆరెస్ సెల్ సభ్యుల దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించిన ప్రెసిడెంట్ సతీష్ కుమార్ రాధారపు, వైస్ ప్రెసిడెంట్ వెంకటేష్ బోలిశెట్టి వారి కంపెనీ యజమాని / అధికారులతో మాట్లాడి వారి పార్తివ దేహంతో పాట్ మరో వ్యక్తి కి టికెట్ ఇచ్చి ఇండియాకు తేదీ 22.8.17న రాత్రి గల్ఫ్ఎయిర్ ప్లయిట్ నెం. GF274 ద్వారా బహరేన్ నుండి బయలు దేరి 23.8.17 ఉదయం 09:30గం లకు శంషాబాద్ ఎయిర్పోర్ట్కు పంపగా, ఎయిర్ పోర్ట్ నుండి స్వగ్రామానికి రవాణా చేయడానికి టీఆర్ఎస్ నిజామాబాదు ఎంపీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కవిత కల్వకుంట్ల గారి ఆధ్వర్యంలో జాగృతి రాష్ట ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి మరియు బాబు రావు ఇందుకు ఉచిత అంబులెన్సు సౌకర్యం కల్పించారు. వారి ప్రవీత ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ఎన్నారై టీఆరెస్ సెల్ బహరేన్ ప్రెసిడెంట్ సతీష్ కుమార్ రాధారపు, వైస్ ప్రెసిడెంట్ వెంకటేష్ బోలిశెట్టి, జనరల్ సెక్రెటరీలు, డా రవి, సెక్రెటరీలు రవిపటేల్, సుమన్, జాయంట్ సెక్రెటరీలు రాజేంధార్, గంగాధర్, విజయ్, సంజీవ్, దేవన్న, ఎగ్సిక్యుటివ్ మెంబర్స్ సుధాకర్, రాజేష్, రాజు, నర్సయ్య, సాయన్న, తదితరులు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియ చేసారు.

తాజా వార్తలు
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు
- విదేశీ విద్యార్థులకు US కొత్త రూల్స్..!
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు.. కువైట్పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ఇరాన్ పై అమెరికా వరుసగా 10వ రాత్రి దాడులు..
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు







