దక్షిణాఫ్రికా లోని మనుషుల్ని తిని అలసిపోయిన నరమాంస భక్షకుడు
- August 23, 2017
మనిషి ని మనిషి చంపుకొని తినే స్థాయి నుంచి మానవుడు నాగరికత నేర్చాడు.. కానీ ఇప్పటికీ కొన్ని చోట్ల నర మాంస భక్షకులు ఉన్నారనే వార్తలు అప్పుడప్పుడు వినిపిస్తుంటాయి.. తాజాగా ఓ నరమాంస భక్షకుడు తాను మనుషుల్ని తిని తిని అలసిపోయాను.. ఇక మనుషులను తినలేను అని పోలీస్ స్టేషన్ లో లొంగి పోయాడు. తాను లొంగిపోతూ.. పోలీసులకు ఓ మనిషి కాలు, చేతిని కూడా అప్పగించి వారికి షాక్ ఇచ్చాడు.. వివరాల్లోకి వెళ్తే..
దక్షిణాఫ్రికా లోని అమాంగ్వే ప్రాంతంలో గత కొంత కాలంగా పలువురు కనిపించకుండా పోతున్నారు. దీంతో చాలా మంది తమ వాళ్ళు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపద్యంలో పోలీసులు విచారణ చేపట్టగా ఓ ప్లేస్ లో కుండ దానినిండా మానవ అవయవాలు లభ్యమయ్యాయి. అంతేకాదు.. ఇటీవల ఓ మహిళను ముగ్గురు వ్యక్తులు కలిసి దారుణంగా చంపేసి.. ఆమె మృత దేహాన్ని ముక్కలుగా నరికేశారు. ఆపై.. ఆమె మృతదేహంలోని అవయవాలను ఆ ముగ్గురు వ్యక్తులు తినేశారు.. ఈ విషయం పోలీసుల పరిశోధనలో వెలుగులోకి వచ్చింది.. కాగా ఈ ముగ్గురు వ్యక్తుల్లో ఒకరు తాను మనుషులను తిని అలసిపోయాను అని స్వయంగా పోలీసులకు లొంగిపోవడం తో అతనిని అదుపులోకి తీసుకొన్నారు.. మిగిన ఇద్దరు నర మాంస భక్షకుల కోసం వెదుకుతున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







