నందమూరి బాలకృష్ణ–పూరి జగన్నాథ్– భవ్య క్రియేషన్స్ల 'పైసా వసూల్' సెన్సార్ పూర్తి
- August 24, 2017
‘తమ్ముడూ... నేను జంగిల్ బుక్ సినిమా చూడల . కాని అందులో పులి నాలాగే ఉంటుందని చాలామంది చెప్పారు. అది నిజమో కాదో మీరే చెప్పాలి’...
‘మందేసిన మదపుటేనుగునిరా! క్రష్ ఎవ్రీవన్'...
అంటూ డైలాగులతో, 'మావా.. ఏక్ పెగ్గు లా..' పాటతో నందమూరి బాలకష్ణ అభిమానులను ఖుషీ చేశారు. టీజర్, స్టంపర్ తో
'పైసా వసూల్'పై భారీ అంచనాలు నెలకొనేలా చేశారు దర్శకుడు పూరి జగన్నాథ్. నిర్మాత వి. ఆనందప్రసాద్ రాజీపడకుండా నిర్మించారని టీజర్, స్టంపర్ చూపించాయి. భవ్య క్రియేషన్స్ పతాకంపై ఆయన నిర్మించిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెప్టెంబర్ 1న గ్రాండ్ రిలీజ్ కు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా వి. ఆనందప్రసాద్ మాట్లాడుతూ - "సెన్సార్ బోర్డ్ యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చింది. సినిమా బాగా వచ్చింది. బాలకృష్ణ గారి అభిమానులు కోరుకునే అంశాలన్నీ పుష్కలంగా ఉన్నాయి. ఫుల్ ఎనర్జిటిక్ క్యారెక్టర్ ని బాలయ్య అద్భుతంగా పోషించారు. డూప్ లేకుండా ఆయన చేసిన యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకులను థ్రిల్ కు గురి చేస్తాయి. అభిమానులను ఖుషీ చేస్తాయి. పూరి జగన్నాథ్ గారు ఓ కొత్త బాలయ్యను చూపించారు. అనూప్ రూబెన్స్ ఇచ్చిన పాటలకు మంచి స్పందన లభిస్తోంది. మా బేనర్ లో బాలయ్యతో మేం నిర్మించిన ఈ తొలి చిత్రం ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది.
శ్రియ, ముస్కాన్, కైరా దత్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్–హాలీవుడ్ నటుడు కబీర్ బేడి ప్రత్యేక పాత్ర పోషించారు. ఇంకా అలీ, పృథ్వీ, పవిత్రా లోకేష్, విక్రమ్ జిత్ తదితరులు నటించారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







