పోలీస్‌ ముసుగులో దోపిడీ: ఇద్దరి అరెస్ట్‌

- August 24, 2017 , by Maagulf
పోలీస్‌ ముసుగులో దోపిడీ: ఇద్దరి అరెస్ట్‌

బహరేన్: జనరల్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ క్రిమినల్‌ ఇన్వెస్టిగేషన్‌ అండ్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం పోలీసు ముసుగులో దోపిడీలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులు పట్టుబడ్డారు. పోలీస్‌ వేషాలేసుకుని, బెదిరింపులకు పాల్పడుతూ అమాయకుల నుంచి డబ్బులు గుంజుతోన్న ఈ ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన సమాచారం అందడంతో వ్యూహాత్మకంగా వ్యవహరించారు పోలీసులు. ఈ క్రమంలోనే నిందితుల్ని అరెస్ట్‌ చేయడంతోపాటుగా, వారు దొంగతనాలకు వినియోగిస్తున్న కారుని కూడా స్వాధీనం చేసుకున్నారు. పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌కి ఈ కేసును అప్పగించేందుకోసం అవసరమైన లీగల్‌ ప్రొసీడింగ్స్‌ని పోలీసులు పూర్తి చేస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com