జీతాల చెల్లింపుపై ఎంఓఎం, సిబిఓ జాయింట్‌ మానిటరింగ్‌

- August 24, 2017 , by Maagulf
జీతాల చెల్లింపుపై ఎంఓఎం, సిబిఓ జాయింట్‌ మానిటరింగ్‌

మస్కట్‌: మినిస్ట్రీ ఆఫ్‌ మేన్‌ పవర్‌ (ఎంఓఎం), ప్రైవేటు సంస్థల నుంచి డాటాను తెప్పించుకుంటోంది. సేలరీ ట్రాన్స్‌ఫర్స్‌, వేతనాల చెల్లింపులో ఆలస్యం వంటి అంశాలను విశ్లేషించేందుకే ఈ చర్యలు చేపడుతోంది. ఎంఓఎం అలాగే సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఒమన్‌ సంయుక్తంగా ప్రైవేటు సంస్థలకు సంబంధించిన డేటాను మానిటర్‌ చేయడం జరుగుతుంది. జీతాల చెల్లింపులు, వేతనాల ఆలస్యానికి సంబంధించి సమస్యలు రోజురోజుకీ పెరుగుతున్న దరిమిలా, మినిస్ట్రీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మానిటరింగ్‌, కార్మికుల మేలు కోసమేనని అధికారులు వెల్లడించారు. వేతన బకాయిలకు సంబంధించి కార్మికులు ఆందోళనలు చేయడం పరిపాటిగా మారుతుండడం ఒక్కోసారి కంపెనీలు కార్మికులకు నష్టం కలిగించే చర్యలు చేపడుతుండడంతో మినిస్ట్రీ జోక్యం చేసుకోవాల్సి వస్తుంది. సమస్య తీవ్రతను ముందే గుర్తించడానికి ఈ మానిటరింగ్‌ వ్యవస్థ ఉపకరిస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com