శర్వానంద్ 'మహానుభావుడు' టీజర్ అంటున్న జనం
- August 25, 2017
గత కొంత కాలంగా తెలుగు ఇండస్ట్రీలో యంగ్ హీరో శర్వానంద్ కి గోల్డెన్ టైమ్ నడుస్తుందనే చెప్పొచ్చు. ఈ సంవత్సరం వచ్చిన 'శతమానం భవితి' సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఆ మద్య వచ్చిన 'రాధ' కూ పరవాలేదు అనిపించింది. తాజాగా శర్వానంద్ హీరోగా యూవీ క్రియేషన్స్ బేనర్ పై మారుతి తెరకెక్కిస్తున్న కమర్షియల్ ఎంటర్టైనర్ మహానుభావుడు.
" మహానుభావుడు " చిత్రం ఫస్ట్ లుక్, టీజర్ లో ఆనంద్ రోల్ లో నటిస్తున్నాడు. ఇక మనోడికి ఓ ఫోబియా ఉంటుంది..అదే అతి శుభ్రత. మరి ఆ అతి శుభ్రతతో ఎన్ని రిస్క్ లు ఎదుర్కొంటాడో సినిమాలో చూడాల్సింది...గతంలో మారుతి హీరో నానితో మతిమరుపు క్యారెక్టర్ తో 'భలే భలే మగాడివోయ్' చిత్రం తీశారు. ఆ చిత్రం అనుకున్నదానికన్నా సూపర్ డూపర్ హిట్ అయ్యింది.
కాగా, వినాయకచవితి సందర్భంగా చిత్ర టీజర్‌ని విడుదల చేశారు. 'నా పేరు ఆనంద్ నాకో ఓసిడి వుంది. ఓ సిడి అంటే బిటెక్, ఎమ్ టెక్ టాంటి డిగ్రీలు కాదు డిజార్డర్. ఈ లక్షణాలు అతిశభ్రం, విపరీతమైన నీట్ నెస్.. అంటూ వాయిస్ ఓవర్‌తో' స్టార్ట్ చేశారు.నిర్మాతలు మాట్లాడుతూ.. మా బ్యానర్లో శర్వానంద్‌తో మూడవ చిత్రం. హాస్యాన్ని పండించగల దర్శకుడు మారుతి.
టీజర్‌కూడా అదే తరహాలో వుంటుంది. ట్రైలర్ త్వరలో విడుదల చేస్తాం. నేటి నుంచి డబ్బింగ్ కార్కక్రమాలు ప్రారంభించాం అన్నారు. దర్శకుడు మారుతి మాట్లాడుతూ.. టీజర్ అందర్ని ఆకట్టుకుంది. నా శైలిలో కొత్తగా వుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
యూరప్ , పొల్లాచ్చిలో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం త్వరలో ఇటలీ, ఆస్ట్రియా, క్రోటియా వంటి అందమైన ప్రదేశాలలో చిత్రీకరణ జరుపుకోనుంది. తాజాగా విడుదలైన టీజర్ మీరు చూసి ఎంజాయ్ చేయండి.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







