బీఫ్ బ్యాన్‌పై కీలక నిర్ణయం వెలువడనుంది
- August 25, 2017
వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కేనని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన 24 గంటల్లో మరో కీలకమైన అంశంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.
మహరాష్ట్ర ప్రభుత్వం విధించిన బీఫ్ బ్యాన్‌పై సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ శుక్రవారం నాడు ఓ పిటిషన్ దాఖలు చేశారు. వ్యక్తిగత గోప్యత తీర్పు ప్రభావం బీఫ్ బ్యాన్‌పై ఉండే అవకాశం లేకపోలేదని న్యాయమూర్తులు వ్యాఖ్యానించడం గమనార్హం.
ఒక వ్యక్తి ఎలాంటి బట్టలు వేసుకోవాలో, ఏం తినాలో చెప్పే హక్కు ఎవరికీ లేదని గురువారం తీర్పు సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను గుర్తు చేస్తూ గో మాంసం తినటంపై ప్రభుత్వం బ్యాన్ విధించడం సరికాదంటూ ఇందిర వాదన విన్పించారు.
వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తులు ఏకే సిక్రీ , ఆశోక్‌భూషణ్‌లు ఇది వ్యక్తిగత గోప్యత, (ప్రాథమిక హక్కు) వర్తిస్తోందని తదుపరి వాదనను రెండు వారాలపాటు వాయిదా వేశారు.
మహరాష్ట్ర ప్రభుత్వం విధించిన బీఫ్ బ్యాన్ ఆదేశాలను గత ఏడాది ముంబై హైకోర్టు తప్పుబట్టి కొట్టేసింది. దీంతో మహరాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయించింది.
తాజా వార్తలు
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..







