చెల్లించని జీతం: మంత్రిత్వ శాఖని తమ సంస్థ తప్పుదారి పట్టించిందని కార్మికులు వాదన
- August 25, 2017
మనామా: ఒక నిర్మాణం సంస్థకు చెందిన 50 మంది ఉద్యోగులు తమకు బకాయి పడిన జీతాలను తక్షణమే విడుదల చేయాలంటూ డిమాండ్ చేస్తూ గత వారం ఆండలూస్ గార్డెన్ లో నిరసన వ్యక్తం చేసిన విషయం పాఠకులకు విదితమే. గత ఏడాది నవంబర్ నుంచి ఆ కంపెనీలో పనిచేస్తున్న 200 మంది ఉద్యోగులకు యాజమాన్యం వేతనాలను చెల్లించలేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. తాము పనిచేసే కంపెనీ ఉద్యోగులకు జీతాలు చెల్లించినట్లు తప్పుగా మంత్రిత్వ శాఖకు నివేదిక అందచేసిందని.. అయితే ఎంత మాత్రం నిజం కాదని పలువురు కార్మికులు తెలిపారు.ఆ నిర్మాణ సంస్థ యొక్క మాజీ ఉద్యోగులు తాము పనిచేసే కంపెనీ ఉద్యోగులకు జీతాలు చెల్లించినట్లు తప్పుగా మంత్రిత్వ శాఖకు నివేదిక అందచేసిందని. జీతాల చెల్లింపు భరోసాతో సహా, తప్పుడు వాదనలు చేయడం ద్వారా సంస్థ మంత్రిత్వ శాఖ తప్పుదోవ పట్టించిందని కార్మికులు గురువారం పేర్కొనడంతో వీరి సమస్య మరింత తీవ్రమైన మలుపు తిరిగింది.నిరసన తెలియచేస్తున్న కార్మికులు తెలిపిన అభిప్రాయం ప్రకారం, కంపెనీ యజమానులు తమపై ప్రయాణ రుణాలను చెల్లించడంలో విఫలమైనందుకు కోర్టు సూచించిన ప్రకార్యం యాజమాన్యం నెరవేర్చలేదని తెలిపారు. "యాజమాన్యం ప్రయాణ నిషేధం తొలగించటానికి ప్రయత్నిస్తున్నదని " ప్రయాణ నిషేధం ఎత్తివేసినట్లయితే కార్మికులు కింగ్డమ్ ను వదిలివెళ్ళిపోతారని వారు తిరిగి వచ్చే పరిస్థితి లేదని ఒక కార్మికుడు తెలిపారు. కార్మికులు వివరించిన ప్రకారం.. కంపెనీ యజమానులు తమ ఉద్యోగులందరికి జీతాలు చెల్లించినట్లు కార్మిక, సామాజిక అభివృద్ధి మంత్రిత్వశాఖ హామీ ఇచ్చారు. కేవలం ముప్పై మంది బహ్రెయిన్ ఉద్యోగులకు మాత్రమే జీతాలను చెల్లించారు. ప్రవాసీయులు ఎవరికీ ఆ జీతాలు చెల్లించలేదన్నారు తాము పని చేస్తున్న నిర్మాణ సంస్థ మంత్రిత్వ శాఖకు, ప్రజలకు అబద్దం చెబుతున్నారని పేర్కొంటున్నారు. "మేము ఆర్ధికంగా ఎంతో ఇబ్బంది పడుతున్నాం. "మా భవిష్యత్తు నాశనం అవుతుంది.మా వీసాలు ఇప్పుడు గడువు ముగియనుందని నిరసనకారుల కార్యకర్తలలో ఒకరు వాపోయారు.వాస్తవానికి, యాజమాన్యం మాతో మాట్లాడడానికి సైతం నిరాకరించారని ఒక నిరసనకారుడు చెప్పారు, వారితో సంభాషించడానికి చేసే ప్రతి ప్రయత్నం విఫలమైందని అలాగే వివరణ పత్రాల కోసం సంస్థ అధికారులను కలుసుకునేందుకు చేసే ప్రయత్నంలో కార్మికులాలను కంపెనీ ప్రాంగణంలోకి అడుగు పెట్టనీయకుండా యాజమాన్యం కఠినంగా నిరాకరించారు.మేము మా చెల్లింపులపై స్పష్టమైన స్పందన కోసం చూస్తున్నామని ఒక మాజీ ఉద్యోగి తెలిపారు యాజమాన్యం పేర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను మేము అర్థం చేసుకున్నాము, కానీ వారి ఉద్దేశాలను గురించి కనీసం మాకు వాస్తవ సమాచారం ఇవ్వవలసిన అవసరం వారికి ఉందని నిరసనకారులు తెలిపారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







